in

మూడేళ్ల బాలుడి అరుదైన రికార్డు!

మూడేళ్ల బాలుడి అరుదైన రికార్డు!

ఓ బాలుడు ఎవరూ ఊహించని ఘనత సాధించాడు. మూడున్నరేళ్ల వయసులోనే 17,598 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా ఎత్తయిన ఉమ్లింగ్ లా పాస్(19,024 అడుగులు) కు వెళ్లివచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు.

వివరాల్లోకి వెళ్తే దక్షిణ కన్నడ జిల్లా సూలియాకు చెందిన జజీల్ రెహ్మాన్ అనే మూడున్నరేళ్ల చిన్నారి.. తన తల్లిదండ్రులు తౌహీద్ రెహ్మాన్, జష్మియాలతో కలసి ఆగస్టు 15న బైకై పై సూలియాలో బయలుదేరాడు. వీళ్ళు 19 రోజుల్లో దాదాపు 5వేల కిలోమీటర్లు ప్రయాణించి.. గత శనివారం లద్దాబ్లోని ఉమ్లింగ్ లాకు వెళ్లారు. అక్కడ జాతీయ జెండా, కర్ణాటక జెండా, తులునాడు పతాకాలను ఆవిష్కరించారు. ఉమ్లింగ్ లా ప్రాంతం భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైంది. ఇక్కడ చిషున్లే నుంచి డెమో చోక్ వరకు ఉండే 52 కిలో మీటర్ల మార్గం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రహదారిగా పేరుగాంచింది. ఇక్కడ ఆక్సిజన్.. సాధారణ స్థాయితో పోల్చితే 43శాతం మాత్రమే ఉంటుంది.

ఆ విధంగా నేపాల్లో సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కన్నా ఎత్తయిన ఉమ్లింగ్ లా పాస్(19,024 అడుగులు) కు వెళ్లివచ్చిన అతిపిన్న వయస్కుడిగా జజీల్ రెహ్మాన్ రికార్డు సృష్టించాడు.

అయితే గతంలో గురుగ్రామ్ కు చెందిన ఏడున్నరేళ్ల చిన్నారి పేరిట ఈ రికార్డు ఉండగా.. ఇప్పుడు జజీల్ రెహ్మాన్ మూడున్నరేళ్ల వయసులోనే ఈ ప్రాంతానికి వెళ్లి వచ్చి ఆ రికార్డును బద్దలుకొట్టాడు.

What do you think?

టాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ వెబ్సైట్ స్ట్రాంగ్ వార్నింగ్!

“ప్రజాస్వామ్యం అపహాస్యమైంది” చంద్రబాబు అరెస్ట్ పై కె.రాఘవేంద్ర