in

192 బిలియన్ డాలర్లతో ఎలోన్ మళ్ళీ మొదటి స్థానానికి!

192.3 బిలియన్ డాలర్లతో ఎలోన్ మస్క్ మళ్ళీ మొదటి స్థానానికి!

ట్విట్టర్, టెస్లా, స్పేస్ ఎక్స్ ల అధినేత ఎలోన్ మస్క్ మళ్లీ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. మొన్నటివరకు బెర్నార్డ్ ఆర్నాల్డ్‌‌ ప్రధమ స్థానంలో ఉండగా.. ఆయనను వెనక్కు నెట్టి ఇప్పుడు ఎలోన్ ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నారు.

మొన్నటి వరకు ప్రపంచ అపర కుబేరుల జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్డ్‌‌ ప్రధమ స్థానంలో ఉండగా ఆయన నికర విలువలో ఏప్రిల్ నుంచి ఎల్విఎంహెచ్చ్ (LVMH) షేర్లు 10 శాతం కొల్పోయాయి. ఈ కారణంగా ఆర్నాల్డ్ సంపద 11 బిలియన్ డాలర్లు తగ్గడంతో ఆయన రెండో స్థానానికి పడిపోయారు. దీంతో ఈ కుబేరుల జాబితాలో ఎలోన్ మస్క్ రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకున్నారు. అలా ఆయన ప్రపంచ అపర కుబేరుల జాబితాలో మరో సారి మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ అందించిన సమాచారం మేరకు ఎలాన్ మస్క్ ప్రస్తుత సంపద 192.3 బిలియన్ డాలర్లుండగా.. ఆర్నాల్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

What do you think?

భారత్ అక్కడ ఆడ బోవడం లేదు.పాక్ లేకుండానే మ్యాచలు..

లోకేశ్ పై గుర్తు తెలియని వ్యక్తుల కోడిగుడ్ల దాడి!