in

బెంగళూరులో భారీ పేలుళ్లకు ప్లాన్.. అడ్డుకున్న పోలీసులు

బెంగళూరులో భారీ పేలుళ్లకు ప్లాన్.. అడ్డుకున్న పోలీసులు

బెంగుళూరు లో పెను ప్రమాదం తప్పింది. బెంగుళూరులోని పలు చోట్ల భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన ఐదుగురు తీవ్రవాదులను బుధవారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పొలీసులు అరెస్ట్ చేశారు.

సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో బుధవారం తీవ్రవాదులు స్థావరం పై దాడి చేసి, ఐదుగురు అనుమానిత టెర్రరిస్ట్ లను అదుపులోకి తీసుకున్నారు.
వీరిని 2017లో ఓ హత్య కేసులో బెంగుళూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన దోషులు జాహిద్, జానిద్, సయ్యద్ సుహేల్, ముదస్సిర్, ఉమర్ లుగా పోలీసులు గుర్తించారు. జైల్లో ఉన్న సమయంలో వీరికి కొందరు ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని.. వారి సూచనల ప్రకారమే వీళ్ళు బెంగుళూరులో పలు చోట్ల భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారని భావిస్తున్నారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్ధాలను, భారీగా లైవ్ బుల్లెట్స్, ఏడు పిస్టల్స్ ఇతర పేలుడు పదార్ధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి పేలుడు పదార్ధాలను సప్లయ్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం పేలుళ్లు ఎక్కడ ప్లాన్ చేశారు, ఎప్పుడు, ఎలా ప్లాన్ చేశారు అన్న వాటిపై ఐదుగురు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మరో వైపు ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA)కు అప్పగించాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కోరారు. బెంగళూరులో వరుస పేలుళ్లకు పాల్పడి నగరంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి ప్లాన్ చేశారంటే వీరి వెనుక ఇంకా చాలా మంది ఉండి ఉండవచ్చని.. అందువల్ల ఎన్ఐఏ కు ఈ కేసును అప్పగించాలని ఆయన కోరుతున్నారు.

What do you think?

ఈ నెల 27న రైతులకు అందనున్న పీఎం కిసాన్ యోజన

గిన్నిస్ బుక్ రికార్డు కోసం కంటి చూపు కోల్పోయాడు