in ,

ఆశ్చర్యపరిచే 5 అద్భుతమైన నిజాలు #పార్ట్ 1…..!

ఆశ్చర్యపరిచే 5 అద్భుతమైన నిజాలు

ఈ ప్రపంచంలో మనుషులకు తెలిసినవి కొన్నే,కానీ తెలియాల్సినవి ఎన్నో. అలాంటి కొన్ని విషయాలలోని విశేషమైన నిజాలు ఈరోజు తెలుసుకుందాం.

1.పురాతనమైన చక్రం
మనల్ని తక్కువ సమయంలో తక్కువ శ్రమతో వెళ్ళాలనుకున్న ప్రదేశానికి సులువుగా తీసుకువెళ్ళడానికి,అవసరమైన వాటి రవాణాకు సహాయపడే ప్రతి వాహనానికి మూలం చక్రం. చిన్న సైకిల్ నుంచి పెద్ద బస్ వరకు ప్రతి వాహనానికి చక్రం అవసరం. అటువంటి చక్రాలలో అంత్యంత పురాతనమైన చక్రం ఐదు వేల సంవత్సరాలకు మునుపే కనుగొనబడిందట. 2002లో స్లోవినియాకు చెందిన ల్జుబ్జానాకు దక్షణంగా 12 మైళ్ళ దూరంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఆ పురాతనమైన చక్రాన్ని వెలికితీయడంతో పాటు రేడియో కార్బన్డేటింగ్ ప్రక్రియ ద్వారా దాన్ని 5100 నుంచి 5350 సంవత్సరాల పురాతనమైనదిగా గుర్తించారు.

2.అత్యంత తడి ప్రదేశం
ప్రపంచంలోనే అత్యంత తడి ప్రదేశంగా గినిస్ బుక్ ఎక్కిన ప్రదేశం మన ఇండియాలోని మేఘాలయ. మేఘాలయకు చెందిన మౌసిన్రామ్లో ప్రతి ఏడాది 11,873 మిల్లీమీటర్ల వర్షం పడుతుందట. ఆపై ఆక్కడ వర్షా కాలం 6 నెలల పాటు నడుస్తుందట. అందువల్లనే మేఘాలయలోని మౌసిన్రామ్ ప్రపంచంలోనే అత్యంత తడి ప్రదేశంగా పిలుస్తున్నారు.

3.ఎలుకల గుడి
రాముడి గుడి,శివుని గుడి,ఆంజనేయస్వామి గుడి ఇలా అందరి దేవుళ్ళకు గుడుల్లునాయ్యి. అయిన అవి ఏవి మనల్ని ఆశ్చర్యపరచవు కానీ ఎలుకలకు కూడా గుడుందంటే ఇది కశ్చితంగా అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. రాజస్థాన్లోని బికనేర్కు 30 కిలోమీటర్ల దూరంలో కర్ని మాత గుడుంటుంది. దానినే ఎలుకల గుడి అనికూడా అంటారట. అక్కడకి వచ్చే భక్తులు అందరూ ఆ ఎలుకలను పవిత్రమైన వాటిగా కొలుస్తూ భక్తితో పూజిస్తారట.

4.ఈజిప్ట్ కంటే ఎక్కువ పిరమిడ్లు
ఈ ప్రపంచంలో మనుషుల్ని అబ్బురపరిచే అద్భుతాలలో ఈజిప్టులోని పిరమిడ్లు కొన్ని. అయితే ఈజిప్టులో కంటే ఎక్కువ పిరమిడ్లు ఉన్న ప్రదేశం సుడాన్. ఈ పిరమిడ్లు ఆ కాలంలో నుబియన్ రాజులు చనిపోయిన తరువాత పాతి పెట్టడానికి నిర్మించగా ఇవి సుమారుగా 255 వరకు ఉంటాయట.

5.మొదటి వైద్య వృత్తి
మనుషులకు ఏవిధమైన గాయాలైన లేక వారు అనారోగ్యానికి లోనైన వారిని వైద్య చికిత్స మరొక దేవుడై కాపాడుతుంది. అలాంటి వైద్యాలలో దంత చికిత్స వైద్య వృత్తులలోనే పూరతనమైనదని బిబిసి వాళ్ళు చేసిన పరిశోధనలో తేలింది. వారు చేసిన పరిశోధనలో 7500 నుంచి 9000 సంవత్సరాల మద్యలో పాడైపోయిన పన్నును ఒక డ్రిల్లర్తో తొలగించారని తెలిసింది. దేనితో అన్ని వైద్య వృతులలోనే దంత చికిత్స మొదటి వైద్యవృత్తిగా వెల్లడైంది.

What do you think?

అందం కన్నా.. ఆత్మ విశ్వాసం ముఖ్యం అంటున్న ససుఫాన్‌

ఆసక్తికరమైన 4 వాస్తవాలు మీ కోసం…