in ,

ఆసక్తికరమైన 4 వాస్తవాలు మీ కోసం…

ఆసక్తికరమైన 4 వాస్తవాలు

*వి ఐ పి సూట్ కేస్: మీరు ఎపుడైనా గమనించారా వి ఐ పి ల చుట్టూ ఉండే కొంత మంది ఒక సూటుకేసి లాంటిది పట్టుకుని ఉంటారు. చాలామంది ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనుకుంటారు. కానీ కాదు అది వి ఐ పి లను ప్రొటెక్ట్ చేసే ఒక బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్. వి ఐ పి ల మీద ఎవరైనా కాల్పులు జరిపితే ఎమెర్జెన్సీ టైం లో వెంటనే టెంపరరీగా ప్రొటెక్ట్ చేయటానికి పనికొస్తుంది. దీనిని ఫుల్ ఓపెన్ చేస్తే పై నుండి క్రింది వరకు ఫుల్ గా ఒక వాల్ లాగా ఓపెన్ అవుతుంది. అలాగే దీనిలో ఒక గన్ కూడా ఉంటుంది. సో ఇది ఎమర్జెన్సీ టైం లో ప్రొటెక్ట్ చేసే ఒక షీల్డ్.

*వెరైటీ క్లాక్: నెథర్లాండ్ లోని షిఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లో పది అడుగులుండే వెరైటీ క్లాక్ ఉంటుంది. దీనిలో ఉన్న వింత ఏంటంటే ఒక బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నమనిషి టైంను పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. ఇలా నిమిషానికి ఒకసారి లైన్ చెరపటం మళ్ళీ గీయటం చేస్తూనే ఉంటాడు. కాకపోతే దీనిలో నిజంగా మనిషి ఉండడు. ఇదంతా ఒకసారి రికార్డు చేసిన వీడియో దాన్ని అక్కడ నిరంతరం ప్లే చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం చూసినపుడు నిజంగా అక్కడ లోపల మనిషి ఉన్నదేమో అనుకుంటారు. ఈ వీడియోను చిత్రీకరించడానికి పన్నెండు గంటలు దాని పూర్తిగా చెక్ చేయటానికి ఇంకొక పన్నెండు గంటల సమయం పట్టిందట. ఆలా పన్నెండు గంటల పాటు పెయింటింగ్ వేయాలంటే ఎంత ఓపిక ఉండాలో కదా.

*E.G.F: ఈ ప్రపంచం లో మనిషి తవ్విన అత్యంత లోతైన గని ఎంపోనింగ్ గోల్డ్ మైన్ . దీని లోతు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే భూమిపై ఉపరితలం నుండి మధ్యలో కోర్ వరకు ఉన్న దూరం సుమారుగా ఆరువేల మూడువందల కిలోమీటర్ లు అంటే ఇప్పటి వరకు మనిషి తవ్విన అత్యంత లోతైన భాగాన్ని భూమధ్య భాగానికి ఉన్న దూరంతో పోలిస్తే అది కేవలం 0. 00063 % మాత్రమే

*Golden Phone: ఒక వైపు పాడైపోయిన ఒక టన్ను బరువున్న ఐ ఫోన్ ను తీసుకుని మరొక వైపు బంగారపు గనులలో తవ్విన గోల్డ్ ఓర్ ను ఒక టన్ను తీసుకుంటే ఈ గోల్డ్ ఓర్ నుండి వచ్చిన బంగారం కన్నా300 రెట్లు ఎక్కువ బంగారం రీ సైకిల్ చేసిన ఐ ఫోన్ నుండి వస్తుందట. కేవలం ఐ ఫోన్ మాత్రమే కాదు మనం వాడే దాదాపు అన్ని ఫోన్ లలో గోల్డ్, సిల్వర్ వంటి కొన్ని విలువైన మెటల్ ను ఉపయోగిస్తారు.

What do you think?

ఆశ్చర్యపరిచే 5 అద్భుతమైన నిజాలు #పార్ట్ 1…..!

ఈ వంటకాలు తినాలంటే కనీసం మిలియనీర్ అయ్యుండాలి.