in ,

5 బెస్ట్ అనిమేస్ టు వాచ్ పార్ట్ 2

5 బెస్ట్ అనిమేస్ టు వాచ్ పార్ట్ 2

1. మై హీరో అకాడెమియా (my hero academia)

కథ : 14 ఏళ్ల మిదోరియా ఇజుకు ప్రతి మూలా సూపర్ హీరోలతో నిండిపోయిన ప్రపంచంలో ఎటువంటి సూపర్ పవర్ లేకుండా పుడతాడు. ఇలాంటి పరిస్థితి ఉన్నపటికీ ఎప్పటికైనా సూపర్ పవర్ పొంది హీరో అవ్వాలని కలలు కంటుంటాడు. పగటి కలలు కంటున్నాడని మిదోరియా చుట్టు పక్కల వాళ్ళు తనను ఎగతాళి చేస్తుంటారు.

అయితే అనుకోకుండా ఒక రోజు ప్రపంచంలో నంబర్ 1 హీరో అయిన ఆల్ మైట్ ని మిదోరియా కలుసుకుంటాడు. ఈ సమయంలో ఆ నంబర్ 1 హీరో మిదోరియాకు తన పవర్ ఇస్తాడు. ఇక ఆ తరువాత మిదోరియా జీవితం ఎలా మారింది. అతను ప్రపంచంలోనే గ్రేటెస్ట్ హీరోగా ఎలా మారాడు అన్నది ఈ సీరీస్ స్టోరీ.

ఈ అనిమేలోని ప్రపంచం వెస్టర్న్ కంట్రీ సూపర్ హీరో కామిక్ లకు దగ్గరగా ఉంటుంది. అయితే దీనిలోని కథ చాలా వరకు సూపర్ హీరో కామిక్ లకు భిన్నంగా ఉంటుంది. ఇందులోని ప్రతి పాత్రకు ఆసక్తికరమైన బ్యాక్ స్టోరీ ఉంటుంది. దీనిలోని ఎమోషన్స్, కథ నడిచే విధానం ప్రేక్షకుడిని కట్టి పడేస్తాయి. అందుకే ఇది ప్రతి ఒక్కరు చూడగలిగే సిరీస్, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్.

2. జుజుట్సు కైసెన్ (jujutsu kaisen)

కథ : 15 ఏళ్ల యుజి ఇటాడోరి, మెగుమి ఫుషిగురో అనే జుజుట్సు సాసరర్ ని (మంత్రగాడు) అనుకోకుండా కలుసుకుంటాడు. ఈ సమయంలో సుకునా అనే ఓ డీమన్ వేలుని మింగేస్తాడు. దీంతో యుజి శరీరంలోకి సుకున ప్రవేశిస్తుంది. ఇక ఆ తరువాత ఏం జరిగింది అన్నది ఈ సీరీస్ కథ.

ఇది ఒక ప్రత్యేకమైన అనిమే సీరీస్. ఇందులోని ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఒక పక్క దీనిలోని ఇంటెన్స్ స్టోరీ ప్రేక్షకుడిని కట్టిపడేస్తే, మరో పక్క దీనిలోని హాస్యాస్పదమైన సన్నివేశాలు కడుపుబ్బా నవ్వేలా చేస్తాయి. ఇవి రెండు ఈ సీరీస్ ను బింజ్ వాచ్ చేసేలా చేస్తాయి.

3. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ (Full metal alchemist)

కథ : అనారోగ్యంతో చనిపోయిన అమ్మని తిరిగి బ్రతికించడానికి అన్నదమ్ములైన ఎడ్వర్డ్, ఆల్ఫోన్స్ ఎల్రిక్ లు ఓ ఆల్కెమీ ప్రయోగాన్ని చేస్తారు. అనుకోకుండా ఆ ప్రయోగం చేసే సమయంలో ఎడ్వర్డ్ తన కుడి చెయ్యిని, ఎల్రిక్ తన శరీరాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత కర్మను మార్చలేమని తమ తప్పుని తెలుసుకుని తిరిగి వాళ్ళ పాత రూపాల్ని పొందాలని ఫిలోస్పరస్ స్టోన్ ను కనిపెట్టే ఒక ప్రమాదకరమైన ప్రయాణం మొదలు పెడతారు. చివరికి వారి రూపాల్ని తిరిగి తెచ్చుకున్నారా? ఆ ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? అన్నది మిగతా కథ.

ఈ సీరీస్ లోని కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఇంటెన్స్ గా సాగుతూ చూసే వారిని తల తిప్పకుండా చేస్తుంది. దీనిలో జరిగే కొన్ని సన్నివేశాలు చాలా డార్క్ గా ఉండడం వల్ల వాటి ఎఫెక్ట్ ప్రేక్షకుడి మీద కొన్ని గంటల వరకు ఉంటుంది.

4. వన్ పంచ్ మ్యాన్ (one punch man)

కథ : సూపర్ హీరో ప్రపంచంలో 25 ఏళ్ల సైటామా అల్టిమేట్ సూపర్ హీరోగా ఉంటాడు. తన అసాధారణమైన (extraordinary) శక్తితో ఎంత పెద్ద బలవంతుడ్ని అయినా ఒకే ఒక్క పంచ్ తో ఓడిస్తుంటాడు. అయితే ఇలా అసాధారణమైన పవర్ కలిగి ఉండడంతో సైటామా జీవితం బోరింగ్ గా తయారవుతుంది. దీంతో తన జీవితంలో ఆశక్తి కలిగించే దాని కోసం సైటామా వెతుకుతుంటాడు.

ఇది మామూలుగా వచ్చే సూపర్ హీరో సిరీస్ లకు చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులోని సన్నివేశాలు ఆసక్తికరంగా అంటూ అదే సమయంలో హాస్యాస్పదంగా సాగుతాయి. దీని వల్ల ప్రేక్షకులు సీరీస్ ని ఎంజాయ్ చేయగలుగుతారు.

5. కౌ బాయ్ బెబాప్ (cow boy bebop)

కథ : 2071 లో స్పేస్ లో ప్లానెట్స్ మీద ఏర్పడిన కాలనీస్ లో నివసించే కొందరు బౌంటీ హంటర్ లు క్రిమినల్స్ ని పట్టుకునే జర్నీ చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలా వాళ్ళని పట్టుకున్నారు? అన్నది కథ.

ఇది ఒక సైన్స్ ఫిక్షన్ అనిమే సీరీస్. అయితే ఇది స్పేస్ లో జరిగే స్టోరీ అయినప్పటికీ ఇందులో జరిగే సన్నివేశాలు నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇందులోని పాత్రలు, వాటి చుట్టూ జరిగే కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్నిటికంటే ఈ సీరీస్ కి ఒక స్టైల్ ఉంటుంది. అది ఈ సీరీస్ కి ఒక ప్రత్యేకతనిస్తుంది. ప్రేక్షకుడిని బింజ్ వాచ్ చేసేలా చేస్తుంది.

What do you think?

రూ.6కే ఉబర్ రైడ్ పొందిన బెంగుళూరు మహిళ

సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాతకు గుండెపోటు