in

రూ.2 వేల నోట్ల మార్పిడి పై ఎస్బీఐ తీపికబురు!

రూ.2 వేల నోట్ల మార్పిడి పై ఎస్బీఐ తీపికబురు!

 

రూ.2 వేల నోట్ల పై ఎస్బీఐ తీపికబురు చెప్పింది. రూ.2 వేల నోట్లు మార్చుచుకోవలనుకునే వారికి ఊరటనిచ్చింది.

 

ఇటీవలే ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఇచ్చిన ప్రకటన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి కోటీశ్వరుల నుండి సామాన్యుల వరకు అందరూ మునుపటి లాగే నోట్లు మార్చుకోడానికి తిప్పలు పడాల్సి వస్తుందని, గంటలు గంటలు లైన్ లో నుంచోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఆలాంటి ఈ సమయంలో ఎస్బీఐ ప్రజలకు తీపి కబురు చెప్పింది. నోట్లు మార్పిడిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మే 23 నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి ప్రారంభం అవుతుందని తెలిపిన ఎస్బీఐ, నోట్లు బ్యాంక్‌కు వెళ్లి ఈజీగా మార్చుకోవచ్చని చెప్పింది. నోట్లు మార్చుకోవాలనుకునే వారు ఎలాంటి ప్రూఫ్ చూపించాల్సిన పని లేదని, ఎలాంటి ఫామ్స్‌ను ఫిల్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఎవరైనా సరే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి వారి వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లు ఇచ్చి కొత్త కరెన్సీ నోట్లు రూ.200, 500 వంటి వాటిని పొందొచ్చని, ఇలా ఒకేసారి మీరు ఎస్బిఐ బ్రాంచ్‌కు వెళ్లి రూ. 20 వేల వరకు మార్చుకోవచ్చని వివరించింది.

What do you think?

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత!

ఉమ్మడి కృష్ణాజిల్లాలో మృతదేహాల కలకలం!