in ,

వృత్తిలో ఎదగడానికి సహాయపడే 10 సూచనలు

వృత్తిలో ఎదగడానికి సహాయపడే 10 సూచనలు

చాలా మంది తమ జీవితంలో సొంతంగా ఎదగాలని అనుకుంటారు. కానీ వారు చేసే వ్యాపారంలోనైనా లేదా వారు చేసే ఉద్యోగంలోనైనా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అలాంటి వారి కోసం కొన్ని సూచనలు ఈ ఆర్టికల్ తో మీ ముందుకు తీసుకు వచ్చాము. వీటిని చదివి మీ జీవితంలో అమలు చేయండి. మీరు అనుకున్నది సాధించండి.

1. ముందుగా మీ కెరీర్ మ్యాప్ ను పరిశీలించుకోండి

ఒక జాబ్ కి అప్లై చేసే ముందు లేదా మీ కంపెనీలో ప్రమోషన్ అడిగే ముందు లేదా ఒక కొత్త కెరీర్ ను ఎంచుకునే ముందు, మీ కెరీర్ మ్యాప్ ను ఒకసారి పరిశీలించుకోండి. మీరు వేసే అడుగులు మిమ్మల్ని ఎక్కడకి తీసుకువెళ్తున్నాయో ఒక అవగాహన తెచ్చుకోండి. కొత్తగా పుట్టుకొస్తున్న ఉద్యోగాలను బట్టి, ప్రస్తుతం మీరున్న స్థానాన్ని బట్టి మీ కెరీర్ గోల్స్ ను అభివృధి పరుచుకోండి.

2. మనసు మాటను బయటకు రానివ్వండి

ఆలోచిస్తూ కూర్చుంటే లాభం ఏమీ ఉండదు. మీకు ఏం కావాలో తెలుసుకోవాలి, అది దొరికే వరకు దాన్ని చేస్ చేసి, నింగి – నేలా ఒక్కట్టి చేసైనా సరే కావాల్సింది దక్కించుకోవాలి.

మీ వ్యాపారాన్ని అభివృద్ది చేయాలంటే ప్రశ్నలు అడగడంలో ఆసక్తి చూపించండి, మీటింగ్లలో పార్టిసిపేట్ చేయండి. మీ ఉద్దేశాన్ని, ఆలోచనని బయటకు తెలియనివ్వండి. ఫీడ్ బ్యాక్ ను ఓపెన్ మైండ్ తో స్వీకరించండి. ఆ ఫీడ్ బ్యాక్ ను విశ్లేషించి, దానితో మీ పని తీరును మరింత మెరుగు పరుచుకోండి.

గ్రూప్ డిస్కషన్లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి, మీ పనిలో ప్యాషన్ని వెతకండి.
క్లయింట్లతో, కస్టమర్లతో మాట్లాడే ఉద్యోగం మీరు చేస్తుంటే వివిధ రకాల ఇండస్ట్రీలలో పనిచేసి, రిటైల్ సెగ్మెంట్, మిడ్ లెవెల్ సెగ్మెంట్, హెచ్చ్ఎన్ఐ (HNI) సెగ్మెంట్ లాంటి వాటిలో క్లయింట్ల సైకాలజీ ఎలా ఉంటుందో ఒక అవగాహన తెచ్చుకోండి.

ఇలా పలు రకాల ఇండస్ట్రీలలో క్లయింట్లను కలిసి, వారి సైకాలజీ తెలుసుకుంటే మల్టిపుల్ డెసిషన్ మేకర్స్ తో డీల్ చేయడంలో మీ అనుభవాన్ని పెంచుకోగలుగుతారు.

3. వ్యాపార నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి

మీరు పనిచేస్తున్న ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ఏంటో, హైరింగ్ ట్రెండ్ ఎలా ఉందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

కంపెనీలు లేదా పోటీదారులు ఫండ్ రైస్ ఎలా చేస్తున్నారో తెలుసుకోండి. ఆ కంపెనీలు ఎలా పని చేస్తున్నాయో చూడండి.

4. డబ్బు బాషను నేర్చుకోండి

ఆ కంపెనీల ఆర్ధిక నివేదికలేంటో చూడండి, వాళ్ళకి రివెన్యూ ఎలా వస్తుందో తెలుసుకోండి. వాళ్ళ ఫిక్స్డ్ కాస్ట్ (fixed cost) ఎంతో, వెరియబుల్ ఎక్స్పెన్సెస్ (variable expenses) ఎంతో, ఆ కంపెనీకి ప్రాఫిట్ (profit) ఎంత మిగులుతుందో.. ఇలా అన్నిటినీ విశ్లేషించండి.

ఈ విధంగా ప్రతి దానిపై ఒక అవగాహన తెచ్చుకోవడం వల్ల మీరున్న ఇండస్ట్రీలో పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు, తద్వారా మీ కలల కంపెనీ లేదా మీరు నిర్మిస్తున్న కంపెనీకి కావాల్సిన బిజినెస్ మోడల్ ను సమర్థవంతంగా రూపకల్పన చేయగలుగుతారు.

6. సెల్ఫ్ ప్రమోషన్(self promotion)

సెల్ఫ్ ప్రమోషన్ ని చాలా మంది బడాయి కబుర్లను కుంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది నాలెడ్జ్ ని పంచడం అవుతుందే కానీ బడాయి కబుర్లు చెప్పినట్టు అవ్వదు.
ఈ సెల్ఫ్ ప్రమోషన్ ద్వారా, కేస్ స్టడీల ద్వారా మనం పక్క వారికి సహాయపడవచ్చు.

7. కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ (contacts and connections)

ఒక వ్యాపారంలో అన్నిటికన్నా ముఖ్యమైనవి కాంటాక్ట్స్ , ఆ ఇండస్ట్రీలో కనెక్షన్స్. ఏ వ్యాపారం అయినా వీటి వల్లే ముందుకు సాగుతుంది. మీది ఎంత పెద్ద వ్యాపారం అయినా ఇవి లేకపోతే కొంత కాలంలోనే చతికిల పడిపోతుంది.

ఇవి మన గోల్ ను చేరుకోడానికి చాలా సహాయ పడతాయి, మన వ్యాపార ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి.

8. అపార్థాలు, వాదనల (misunderstandings, arguments)

ఒక వ్యాపారంలో విబేధాలు రావడం సహజం. అయితే అవి ముందు వాదనలకు దారి తీసి, ఆ తరువాత అపార్థాలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపెన్ మైండ్ తో అన్ని సలహాలను స్వీకరించండి. ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే ముందు, దాని గురించి రకరకాల ఊహలు పుట్టించుకునే ముందు, ఎదుటి వారిని వారు వాదిస్తున్న విషయం గురించి వివరించమని అడగండి. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అని ఆలోచించి, వాళ్లు చెబుతున్న దానికి సరైన సమాధానం ఉందో.. లేదో.. ప్రశ్నించుకోండి. ఎదుటి వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

9. అన్నిటికీ సిద్ధంగా ఉండండి

ఈ వ్యాపార జీవితంలో మీరు ఎంత కష్టపడినా సరే విజయం బాట పట్టేలోపే ఎప్పుడు ఏం జరుగుతుందో…జీవితం ఎటు తీసుకువెళ్తుందో… ఎవరికీ తెలీదు.

కాబట్టి ఉద్యోగం మారడానికి కూడా సిద్ధంగా ఉండండి. మీరు పని చేస్తున్న ఇండస్ట్రీలో వర్క్ ఫ్లో సైకిల్ ను, డిపార్ట్మెంట్ వర్క్ ఫ్లోను, కంపెనీ వర్క్ ఫ్లో వంటి వాటిని విశ్లేషించి, వాటిపై అవగాహన తెచ్చుకోండి.

ఇలా చేయడం వల్ల మీ ఆలోచనా విధానం మెరుగవుతుంది. మీ నెట్వర్క్,కనెక్షన్ విస్తరిస్థాయి. కొత్త ప్రొఫెషనల్ తో పార్టనర్షిప్ పొందే అవకాశం కూడా కలుగుతుంది.

10. మీ ఆలోచనలు అర్ధం అయ్యేలా చెప్పండి

మీ బాస్ ను లేదా ప్రాజెక్ట్ మానేజర్ కి మీ కేస్ స్టడీను వివరించడానికి కొంచెం సమయాన్ని కేటాయించమని కోరండి. అదే సమయంలో వాళ్ళ సమయానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీ ప్రెజెంటేషన్ ని చాలా ఆసక్తి కరంగా, వాళ్ళు కేటాయించిన సమయంలో అర్థం అయ్యేలా చెప్పండి. 3 పారాగ్రాఫ్ల ఈ-మెయిల్ లను పంపి వారిని తికమక పెట్టకుండా, 3 లైన్ల ఈ-మెయిల్ ను పంపి క్లుప్తంగా విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీరు చెప్పాలనుకున్న విషయం అవతలి వారికి సులభంగా అర్ధం అవుతుంది.

మీ ఆలోచనను లేదా ప్రెజెంటేషన్ ను చెప్పే ముందు దానికి అవసరమయ్యే రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయా..?లేకపోతే దీనివల్ల కర్చు ఎక్కువ అవుతుందా..? అని ఆలోచించండి. దాని వల్ల ప్రొడక్టివిటీ ఎలా పెంచవచ్చో ముందుగానే మీకు మీరు అవగాహన తెచ్చుకోండి.

మీ బాస్ మీకు సమయం కేటాయించగానే ముందు మీరు చెప్పబోయే విషయం వల్ల కంపెనీకి ఎంత విలువ పెరుగుతుంది?, బృందానికి అది ఎలా సహాయ పడుతుంది, కస్టమర్లు దాని వల్ల ఎలా లాభ పడతారు?, దీన్ని పనిలో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు?, దీని వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి? ఇలా మొత్తం విషయాన్ని అర్థం అయ్యేలా క్లుప్తంగా వీలైనంత త్వరగా వివరించండి.

అయితే ఇప్పటి వరకు చెప్పిన వాటికన్నా ముందుగా అందరూ తెలుసుకోవలసినది ఏంటంటే.. జీవితంలో చాలా సార్లు మనం అనుకున్నది జరగదు, మనం చేసే దాంట్లో ఫెయిల్యూర్ కూడా వస్తుంది. కానీ వాటికి భయపడి పనిని మొదలు పెట్టడానికి సంకోచించ కూడదు.

ఎందుకంటే ఫెయిల్యూర్ కూడా సక్సెస్ లో ఒక భాగమే, అది మనల్ని విజయం వైపు వెళ్లడానికి ఆపకూడదు, మరింత అనుభవాన్ని అందించి ముందుకు నడిపించాలి.

What do you think?

ఈమె అథ్లెటా..? రన్నింగ్ రేస్ లో ఇలా పరిగెత్తుతారా?

అరుదైన రికార్డు సృష్టించిన శుభ్‌మన్ గిల్!