in

కోర్టులో నిందితుడి నోటికి టేప్ వేసి మరీ విచారణ…

నోటికి టేప్ వేసి మరీ విచారణ…

మన పరిస్థితుల మూలంగా కానీ అనుకోకుండా కానీ ఎదైన తప్పు చేసినప్పుడు కోర్టులో మన తప్పును వివరించడానికి,సంజాయిషీ కోరడానికి అవకాశం,ఆ స్వతంత్రం మనకు ఉంటుంది. ఒకవేళ మనకు వివరించే అవకాశం ఇవ్వకపోతే? ఆ స్వాతంత్ర్యం మన నుంచి దూరం చేస్తే? ఇలాంటి పరిస్థితినే ఒహియో లోని ఒక నిందితుడు ఎదుర్కున్నాడు.

 

ఒహియో, క్లీవ్లాండ్కి చెందిన ఫ్రాంక్లిన్ విలియమ్స్ అనే వ్యక్తిని దొంగతనాలు,కిండ్నాప్లు చేసినందుకు గాను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచారు. అయితే విచారణ జరుగుతుండగా వేరే వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నిందితుడు విలియమ్స్ పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేశాడు. న్యాయమూర్తీ జాన్ రూసో తనకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లడమని ప్రస్తుతానికి తన తరుపున వచ్చిన న్యాయవాది మాట్లాడతారని విలియమ్స్ కు చెప్పినప్పటికీ పదే పదే మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే రెండు రోజుల ముందు మాత్రమే తన న్యాయవాధిని కలిశానని తన వస్తువులన్నీ తీసేసుకున్నారని,తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని కోరాడు విలియమ్స్. కోర్టులో విచారణ జరిగేట్టపుడు అందరూ నిశబ్ధంగా ఉండడం ద్వారా అక్కడ ఉన్న వారందరికీ మాట్లాడే అవకాశం దొరుకుతుంది. దీని వల్ల న్యాయమూర్తి విషయాన్ని అన్ని కోణాలలో ఆలోచించి అర్థం చేసుకుని తీర్పును మరింత మెరుగుగా ఇవ్వగలుగుతాడు. ఇందువలనే న్యాయమూర్తి విలియమ్స్ ను మాట్లాడవద్దని కోరారు.

అయినప్పటికీ విలియమ్స్ మాట్లాడుతూనే ఉండడంతో వేరే మార్గం లేక తప్పని పరిస్థితితులలో మరొకరికి కూడా మాట్లాడే అవకాశం కలిప్పించాలనే భావనతో ఆరుగురు పోలీస్ అదికారులను పిలిచి విలియమ్స్ నోటికి డక్ట్ టేప్ వేయించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఒహియో సుప్రీం కోర్టు ఫ్రాంక్లిన్ విలియమ్స్ విచారణను వేరే న్యాయమూర్తికి అప్పగించారు. ఆ తరువాత విచారణలో జాన్ రూసో తను చేసిన పని సమంజసం కాకపోయినా పరిస్థితులవల్ల చేయవలసి వచ్చిందని వివరిస్తూ క్షమాపణ కోరారు.

జైల్ సెల్లో నుంచి విలియమ్స్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ నాకు ఏం జరుగుతుందో చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని అందువల్ల మాత్రమే తను పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేశానని వివరించాడు. కోర్టులో తన నోటికి టేప్ వేయడం చాలా సిగ్గుగా అనిపించిందని,తన కుటుంబం చూసుంటే బాధపడేవారని చెప్పుకొచ్చాడు.

ఎదేమైన ఒక నిందితుడు తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వడం ధర్మం. నిందితుడు అనవసరంగా మాట్లాడుతున్నాడని నోటికి టేప్ వేయడం ఆమోదయోగ్యం కానిదని, నిందితుడిని మాట్లాడకుండా చేయడానికి వేరే ఆలోచన చేయవలసిందని, ఒక కుక్క నోటికి టేప్ వేసినందకు ఒక వ్యక్తికి 5 ఏళ్లు జైలు శిక్షపడిన కాలంలో ఇలా చేయడం ఇంకెంత పెద్ద నేరంగా పరిగణించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

What do you think?

కవలలకు తల్లి ఒక్కరే కానీ తండ్రులే వేరు..!

“కోహినూర్”మళ్ళీ తిరిగి భారత్ కు రానుందా..?