in ,

“కోహినూర్”మళ్ళీ తిరిగి భారత్ కు రానుందా..?

కోహినూర్

10.5 కారాట్లతో కాంతులీనే ఈ వజ్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది. కోహినూర్ వజ్రమే పురాణాలలోని శమంతకమణి అని నమ్మే వారు ఉన్నారు. బాబర్ ఈ కోహినూర్ విలువ, ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినట్టు అన్నాడట.

కోహినూర్ వజ్రానికి పెద్ద చరిత్రే ఉంది. భారత్లోని గోల్కొండ గనిలో 14వ శతాబ్దంలో మొట్ట మొదట కోహినూర్ వజ్రం దొరికింది. ఈ వజ్రం బ్రిటిషర్ల చేతిలోకి 1849లో రాజా దులీప్ సింగ్ ఈ వజ్రాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు.

భారత్ లో బయటపడి బ్రిటన్కు చేరిన ఈ అరుదైన కోహినూర్ వజ్రం బ్రిటన్ రాణి కిరీటానికే అరుదైన ఆకర్షణ తెచ్చింది. ఎలిజిబెత్ కీరీటంలోని 2,800 వజ్రాలతో కోహినూర్ కూడా ఒకటి. ఈ కిరీటాన్ని 1937లో తయారుచేస్తారు. అక్కడి రాణి సిగ పైన ఉన్న కిరీటంలో కొలువు దీరింది.

అంతటి ఘన చరిత్ర కల్గిన ఈ కోహినూర్ వజ్రం రాణి ఎలిజిబెత్ 2 మరణంతో ఎవరికీ చెందనుందనేది ఆసక్తి కరంగా మారింది. 96 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలతో ఈ మధ్యనే తుది శ్వాస విడిచారు ఎలిజిబెత్ 2. అయితే ..బ్రిటన్ రాణి ఇంత కాలం ధరించిన కిరీటంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఆ కిరీటంలో కోహినూర్ వజ్రం ఉంది. ఇప్పుడు అది ఎవరికి దక్కుతుంది? అన్న ఆసక్తి నెలకొంది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రంగ క్యాతీ కాంచిన కోహినూర్ రాజుగా పట్టాభిషక్తుడు కానున్న చార్లెస్ రెండోవ భార్యకు చెందుతుందా? దానికి రాజసౌధం నిబంధనలు అంగీకరిస్తాయా? అనే చర్చ మొదలైంది. బ్రిటన్ ను డబ్బైయేళ్ళ పాటు పాలించిన మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం మరోసారి వార్తల్లో నిలిచింది. మన తెలుగు నేలపై దొరికిన ఈ అరుదైన వజ్రం కోసం ఎన్నో యుద్దాలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో రాజా వంశాలు చేతులుమారిన ఈ కొహినూర్ వజ్రం భారత్ దాటి బ్రిటన్ చేరి అక్కడ రాజ కుటుంబానికి వారసత్వ సంపదగా మారింది.

ఎలిజిబెత్ 2 డెబ్బైయేళ్ళ పాలన పూర్తైన సందర్భంగా ఈ ఏడాది బ్రిటన్లో ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జాతినుద్దేశించి రాణి ఎలిజిబెత్ ఇచ్చిన సందేశంలో తన కోడలు కేమిల్లానే తదుపరి కావాలని ఆకాంక్షించారు. తదుపరి రాణికే ఈ కిరీటం ధారణ జరగనుంది. 1937 కింగ్ జార్జ్ 6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్ ఉంది.

ఇది ఇప్పుడు ఎలిజిబెత్ 2 నుండి కేమిల్లాకు చేరనుంది. రాచరికంలో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. అయితే కెమిల్లా విషయంలో కొంత అనిచ్చితి ఉంది. ప్రిన్స్ చార్లెస్ కు ఆమె రెండోవ భార్య కావటం, కెమిల్లాకు కూడా ఇది రెండోవ వివాహం కావటం ఇందుకు కారణం చార్లెస్ తొలుత ప్రిన్స్ డయానాను వివాహ మాడారు. 1996లో వారు విడాకులు తీసుకున్నాక ఏడాదికే డయానా రోడ్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ తరువాత 2005లో చార్లెస్ కేమిల్లాల వివాహం జరిగింది. అందగత్తె గా విశేష ఆదరణ పొందిన డయానా స్థానంలోకి కేమిల్లా రావడంతో ఆమె పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు గత సర్వేలలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేనిల్లాకు రాణి హోదా పై అనుమానాలుండేవి. వీటన్నిటినీ పక్కన పెట్టు తన కోడలు కేమిల్లాకు రాణి హోదా రావాలని క్వీన్ ఎలిజిబెత్ 2 అభిలషించారు.

ఈ ప్రకటనతో కెమిల్లాకే కోహినూర్ పొదిగిన కిరీటం దక్కుతుంది.
1848 నుండి బ్రిటిష్ రాణీ కిరీటంలో భాగంగ కోహినూర్ ఉన్నపటికీ దాని చారిత్రకాయాజమాన్య హక్కుల విషయంలో మాత్రం భారత్ సహా నాలుగు దేశాలు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

కోహినూర్ ను తిరిగి భారత్ కు రప్పించాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కోహినూర్తో చారిత్రక సంబంధ ఉన్న ఆఫ్గనిస్తాన్,పాకిస్తాన్లు యాజమాన్య హక్కులు కోరుతున్నాయి. ఈ వజ్రం 1849లో బ్రిటిషర్లు పంజాబ్ను ఆక్రమించిన అనంతరం విక్టోరియా రాణి వద్దకు వెళ్ళింది. ఆ తరువాత ఆ రాజకుటుంబం కిరీటంలో భాగంగా ఉంటుంది. 2005లో ఎలిజిబెత్ 2 కుమారుడు చార్లెస్ రెండోవ వివాహం కేమిల్లాతో జరిగింది. కెమిల్లాకు కూడా అంతకు ముందు పెళ్లయింది. ప్రిన్స్ చార్లెస్ డయానాకు 1986లో విడాకులిచ్చారు. దీంతో చార్లెస్ సతీమణి కేమిల్లాకే ఈ కిరీటం వెళ్తుందని వార్తలు ఊపందుకున్నాయి.

What do you think?

కోర్టులో నిందితుడి నోటికి టేప్ వేసి మరీ విచారణ…

చరిత్రలో నిలిచిపోయిన 5 అద్భుతమైన ఆవిష్కరణలు…..!