in ,

వినాయక చవితికి ట్రెండ్ ఫాలో అవుతున్న గణపయ్య..!!

 

దేవుడు ట్రెండ్ ఫాలో అవుతున్న గణపయ్య..

యావత్ భారతదేశం మొత్తం ప్రతి సంవత్సరం వినాయక చవితి అంగ రంగ వైభవం గా చేసుకునే విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా జంట నగరాలూ అయినటువంటి హైదరాబాద్- సికింద్రాబాద్ లలో హంగు ఆర్భాటానికి మాత్రం జనాలు తగ్గేదేలే అంటారు. ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ మన బొజ్జ గణపయ్య కూడా తగ్గేదేలే అంటున్నాడు. దేవుడు ట్రెండ్ ఫాలో అవ్వడం ఏంటి అనుకుంటున్నారా అవును దేవుడ్ని కూడా ట్రెండ్ కి తగ్గట్టు పెట్టడమే ఇప్పుడు బిగ్గెస్ట్ ట్రెండ్!

ఒకప్పుడు గణపతి విగ్రహం అంటే బొజ్జ తో ఉన్న గణపయ్యని పెట్టేవారు. కానీ ఇప్పుడు దానికి బిన్నంగా వారి ఫేవరెట్ హీరో హిట్ మూవీ లోని గెటప్ ని గణపయ్య కి వేసి సిక్స్ ప్యాక్, బాణం విల్లుతో, పెద్ద పెద్ద కత్తులతో వీక్షకుల దృష్టిని ఆకట్టుకునేలా కొత్త కొత్త రూపాలు చెక్కుతున్నారు. కొందరు దీన్ని మెచ్చి హర్షిస్తుంటే, విమర్షించే వారు కొందరు ఉన్నారు. రూపాలు ఎన్ని ఉన్నా దేవుడు ఒక్కడే అని నమ్ముదాం, మట్టి వినాయకుడిని వాడుదాం- మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం.

What do you think?

వినోదాన్ని పంచే టాప్ 5 జీ-5 సినిమాలు #పార్ట్ 1….

ఈ అమ్మాయి చిన్న వయసులోనే ఎవరెస్ట్ అదిరోహించింది!