in

యాపిల్లో లేఆఫ్లు లాస్ట్ ఆప్షన్. కానీ…

లేఆఫ్లు లాస్ట్ ఆప్షన్. కానీ…

 

ఆర్థిక మాంద్యం భయంతో ప్రపంచవ్యాప్తంగా చాలా ఐటీ కంపెనీలు లేఆఫ్లు విధిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ లేఆఫ్ల జాబితాలోకి యాపిల్ కూడా చేరబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నమ్మాలో వద్దో తెలియక ఉద్యోగులు సతమతమౌతుండగా.. యాపిల్ సిఈఓ టిమ్ కుక్ లేఆఫ్ల పై స్పందిస్తూ ఉద్యోగులకు స్పష్టతనిచ్చారు.

ఇటీవల యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొద్ది మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలు వెలువడడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా.. ఈ విషయంపై టిమ్ కుక్ స్పందించారు. అన్ని దార్లు మూసుకుపోయిన తరుణంలో చివరి అంశంగా మాత్రమే లేఆఫ్ల గురించి ఆలోచిస్తామని, ప్రస్తుతం అందరు మాట్లాడుతున్నట్లుగా లేఆఫ్లు ఇప్పట్లో ఉండకపోవచ్చని వెల్లడించారు. తాము ప్రస్తుతానికి నియామకాల ప్రక్రియను కూడా కొనసాగిస్తామని, కానీ గతంలో కంటే తక్కువ మొత్తంలోనే ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు.

 

అయితే ప్రస్తుతం కంపెనీకి ఎదురయ్యే సవాళ్లను సరైన పద్ధతిలో ఎదుర్కొంటున్నామని, కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని టిమ్ కుక్ అన్నారు.

 

ఇప్పటికే ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు మాస్ లేఅఫ్ చేశాయి. కొన్ని కంపెనీలు సెకండ్ రౌండ్ లేఆఫ్ కోసం సిద్దం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో టిమ్ కుక్ లేఆఫ్లు ఇప్పుడు జరిగే అవకాశం లేదని చెప్పడం ఒక పక్క ఆనందాన్ని కలిగిస్తున్నా.. మరో వైపు పరిస్థితులు అనుకూలించక పోతే యాపిల్ లేఆఫ్ లే పరిష్కారంగా పరిగణిస్తుందని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

What do you think?

అన్నం వండలేదని భార్యను హతమార్చిన భర్త…

30 ఇయర్స్ హాస్య నటుడు పృథ్వీరాజ్ కు అస్వస్థత.