in

తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖ షాక్

ప్రత్యేక రాష్ట్రంగా విభజించక ముందు తెలంగాణ మరియు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉన్న విషయం తెలిసినదే. విభజన తర్వాత APGENCO తెలంగాణ DISCOMS కు 02.06.2014 నుండి 10.06.2017 వరకు AP పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 యొక్క షెడ్యూల్ XII యొక్క క్లాజ్ C.2 ప్రకారం విద్యుత్‌ను సరఫరా చేసింది.

జూన్ 2, 2014 నుండి జూన్ 10,2017 వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయబడిన విద్యుత్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు బకాయి మొత్తాలను చెల్లించాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ రోజు తెలంగాణను ఆదేశించింది. చెల్లించాల్సిన మొత్తం రూ.3,441.78 కోట్లు ఉండగా ఇప్పటివరుకు చెల్లించకపోవడం వలన అదనంగా ఆలస్య చెల్లింపు ‌ఛార్జ్ రూ.3,315.14 కోట్లు జతచేసి మొత్తం రూ.6,756.92 కోట్లు చెల్లించవలిసిందిగా నిర్ణయించింది.

What do you think?

55 Points
Upvote Downvote

చిరంజీవి, రామ్ చరణ్ ఓ.టి.టి లోకి అడుగుపెట్టబోతున్నారా?

పీక్స్ లో ఫ్యాన్ వార్స్ – మితిమీరిన అభిమానం