in

రూ. 74 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.

రూ. 74 లక్షల విలువగల 735 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులను అరెస్ట్ చేయడానికి విశాఖ ఏజన్సీకి వెళ్లేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం చుట్టుకూడి గ్రామానికి చెందిన మురళి బాలకృష్ణన్ తుని పట్టణానికి వచ్చి సన్యాసిరావు అనే వ్యక్తి ద్వారా సుమారు 735 కేజీల గంజాయిని 21 బస్తాలలో లోడ్ చేశాడు. చెన్నెకు చెందిన మహమ్మద్ అలీకి ఇచ్చేందుకు శివ అనే వ్యక్తి తీసుకువెళ్తున్నాడు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా వ్యాన్ వెనుక కంటైనర్లో గంజాయిని ఉంచినప్పటికీ పెదపాడు మండలం కలపర్రు టోల్పాజా వద్ద పోలీసులు వ్యాన్ ఆపి తనిఖీ చేయడంతో గంజాయి రవాణా గుట్టురట్టయ్యింది.

తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్సీ రాహుల్ దేవ్ శర్మ మురళి బాలకృష్ణన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నుందితుల నుండి వ్యాన్ను, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. మిగతా నిందితులను అరెస్ట్ చేయడానికి విశాఖ ఏజన్సీకి వెళ్లేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

What do you think?

నెపోటిజం పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు.

కొడుకై తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు