in ,

ప్రపంచంలోనే సురక్షితమైన టాప్ 5 ప్రదేశాలు #పార్ట్ 1

ప్రపంచంలోనే సురక్షితమైన టాప్ 5 ప్రదేశాలు

 

ప్రతి క్షణం దొంగతనాలు,హత్యలు జరిగే ఈ ప్రపంచంలో అసలు నేరాలు జరగని ప్రదేశాలు ఉన్నాయంటే నమ్ముతార…? నమ్మశక్యంగా లేదు కదా.. కానీ ఇది నిజమేనట.అలా తక్కువ శాతంలో నేరాలు జరిగే కొన్ని దేశాలు,ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

 

1. జపాన్

జపాన్లో పోలీసులు అసలు గన్స్ వారితో ఉంచుకోరట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ అక్కడ హత్యలు,దొంగతనాలు లాంటివి చాలా అరుదుగా జరుగుతాయాట,దాంతో పాటు గొడవలు కూడా తక్కువ జరుగుతాయట. ఇలా నేరాలు జరిగే శాతం తక్కువ కావడంతో అక్కడ పోలీస్ అధికారులు వారితో గన్స్ ఉంచుకోరట.

 

2.ఐస్ లాండ్

జపాన్ లాగే ఐస్ లాండ్లో కూడా నేరాలు జరిగే శాతం తక్కువట. అదేవిధంగా అక్కడ ప్రజలు కూడా చాలా సన్నిహితంగా ఉంటారట. అందువల్లే ఐస్ లాండ్ను యూరోప్లోనే సురక్షితమైన ప్రదేశంగా చెప్పుకుంటారట.

 

3.తువాలు

తువాలులో నేరాలు జరగడం తక్కువ కావడంతో ఈ ప్రదేశం మొత్తంలో ఒకే ఒక్క జైల్ మాత్రమే ఉందట. ఇంకా ఆశ్చర్య పరిచే విషయమేంటంటే ఆ జైల్ను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఉపయోగించలేదట. ఇందువలనే తువాలును ప్రపంచంలోనే సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగనిస్తుంటారట.

 

4. భూటాన్

ఇక్కడ ప్రజలందరూ కలిసి మెలిసి ఉంటారట. దీంతో అక్కడ గొడవలు,దొంగతనాలు లాంటి వాటికి చోటే ఉండదట. ఆయితే మనం వస్తువులపై టాక్స్లను జి.డి.పి ద్వారా ఎలా కొలుస్తామో అక్కడ ప్రజల సంతోషాన్ని జి.ఎన్.స్ (గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్) ద్వారా కొలుసుస్తారట.

 

5.కువైట్

కువైట్లో కూడా నేరాలు చాలా అరుదుగా జరుగుతాయాట. అక్కడి ప్రజలు వేరే దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో చాలా సన్నిహితంగా వ్యవరిస్తూ అవసరమైన విషయాలలో సహాయం కూడా చేస్తుంటారట. పర్యాటకులు కూడా వారి ప్రవర్తన నచ్చడంతో మళ్ళీ మళ్ళీ కువైట్ రావాలని కోరుకుంటుంటారట.

What do you think?

పోర్చుగల్ పెరట్లో అతిపెద్ద డైనోసర్

ప్రపంచంలోనే సురక్షితమైన టాప్ 5 ప్రదేశాలు #పార్ట్ 2