in ,

నేరం ఉచితానిదా, సంక్షేమానిదా ? అసలు నిజం ఏంటి?

నేరం ఉచితానిదా, సంక్షేమానిదా ? అసలు
నిజం ఏంటి?

మనం ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన రాజకీయాల్లో ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఉచిత హామీల వ్యవహారం నిర్విరామంగా సాగిపోతున్నదనేది ఒప్పుకోలేని నిజం. ఏ రాజకీయ పార్టీ కూడా’ ‘ మేం గెలిస్తే ‘అంటూ హామీలు ఇవ్వకుండా రాజకీయాలు చేయలేదనేది సుస్పష్టం. ఆయా రాష్ట్రాల స్థితి గతులు తెలుసుకోకుండా రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ రక రకాల హామీలను గుప్పించేస్తుంటాయి.

ఉచిత విద్యుత్ మొదలుకుని ..చాల ఉచితాలు రాజకీయ పార్టీ ల మేనిఫెస్టో లో కొలువుదీరి ఉంటాయి. ప్రభుత్వ ఖజానా అంటే అదేదో మాంత్రికుడి మాయాజాలం కాదు, జనాల ముక్కుపిండి మరీ వసూలు చేసిన ప్రజాధనం ఆ ఖజానాలో ఉంటుంది.

ఖజానాలో నిధులు సరిపోకపోతే ప్రజల్ని తాకట్టు పెట్టి, వీలైతే ప్రజా ఆస్తుల్ని అమ్మేసి మరీ సంక్షేమ పథకాల్ని అమలు చేయాల్సిన దుస్థితి. అభివృద్ధి కైనా ఇదే మంత్రం – అదే తంత్రం.
ఒకప్పుడు భూమి లభ్యత విరివిగా ఉండేది, ఇప్పుడు లేదు ఎందుకంటే కారణమేంటో తెలుసా ?
ఇదిగో ఇలాగే అధికారం లో ఉన్న వారి రాజకీయ అవసరాల నిమిత్తం, ప్రజల్ని ఉద్దరిస్తున్నామని చెబుతూ ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేయటం. అందుకే ఈ దుస్తుతి అసలు పరిస్థితి.
ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలది ఇదే పరిస్థితి. గురువింద గింజ మాదిరి రాజకీయ పార్టీ నేతలు ఈ ఉచిత, సంక్షేమ వ్యవహారాలపై ఎద్దేవా చేస్తుంటారు.

సంక్షేమాన్ని నేరం గాను, ఉచిత హామీలను పాపం గాను వల్లెవేస్తుంటారు. ఇప్పుడు కలిగిందా వీళ్ళకి పరిపక్వత అని మనం అనుకునే సందర్భాలు వస్తుంటాయి. ప్రధాని మోడీ ఈ మధ్య ఉచిత హామీల విషయమై కీలక వ్యాఖ్యలు చేసారు. అది పట్టుకుని దేశం లో బి జె పి నేతలంతా తమ రాజకీయ దాయాదుల మీద ఉచిత హామీల విమర్శలు చేసేస్తున్నారు.

నేరం ఉచితానిదా సంక్షేమానిదా? అసలు ఇది ఎంత ప్రమాదకరం ? అనే విషయాలపై దేశ వ్యాప్తంగా చర్చలు జరగాలి. రాజకీయ పార్టీస్ లో కాదు, ప్రజలలో చర్చలు జరగాలి. అవును ఎందుకంటే ఆ ఉచిత హామీలకు బొక్క బోర్లా పడి జీవితాన్ని ఫణంగా పెట్టేది ఓటరులే. ఇంకా దారుణం ఏంటంటే అధికారం లో ఉన్నోళ్లు అప్పులు చేసేది ప్రజలపైనే. కానీ ఆయా సంక్షేమ పథకాలకు తమ పేర్లు నామకరణం చేసుకుంటారు. ఇదేదో ఒక పార్టీ కధ కాదు దాదాపు అన్ని పార్టీలది ఇదే దారి. ఇదే స్టోరీ. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ తమ జేబులో డబ్బు ఎందుకు ప్రజలకోసం, ప్రజాసంక్షేమం కోసం వినియోగించదు. అది అంతే ఇదొక రాజకీయ చదరంగం పబ్లిసిటీ స్టంట్ ఈ రాజకీయాలు మారవ్. కానీ కొత్త సూత్రాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.

రాజకీయాలు ఉన్నన్ని నాళ్ళు ఉచితాలుంటాయి. సంక్షేమాలుంటాయి. అప్పులుంటాయి దానికి తగ్గ తిప్పలుంటాయి. ఇందులో ఎవరికి ఎలాంటి ప్రశ్నలుండవ్. ఉచితాలు ఆగిపోతే, సంక్షేమాలు నెరవేరకపోతే రాజకీయమే లేదు. ఇక రాజకీయాల్లో మార్పు అంటారా అది నల్లపూసే.
ఇది అసలు నిజం.

What do you think?

పత్తా లేని క్యాడర్….. తెలుగు దేశం పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల జర్నీకి ఫుల్ స్టాపేనా ?