in

సుప్రీమ్ కోర్టులో న్యాయమూర్తిగా అడుగుపెట్టిన మరో తెలుగోడు.

సుప్రీమ్ కోర్టు లో మరో తెలుగు వాడు జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ నాయమూర్తిగా అడుగు పెట్టారు. ఈ మేరకు శనివారం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
పీవీ సంజయ్‌కుమార్‌ ఆగస్టు 14, 1963లో రామచంద్ర రెడ్డి, పద్మావతమ్మలకు జమించారు.రామచంద్ర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1969 నుంచి 1982 వరకు అడ్వొకేట్ జనరల్ విధులు నిర్వహించారు.

ఐతే వీరి స్వస్థలం కడప జిల్లా అయినప్పటికీ సంజయ్ కుమార్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. చిన్న తనం నుంచే చదువులో మంచి నైపుణ్యం కనపరిచిన సంజయ్ నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2000 నుంచి 2003 వరకు ప్రభుత్వ న్యాయవాదిగానూ ఆయన సేవలందించారు. 2008, ఆగస్టు 8న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. 2010, జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యి వెళ్లిన సంజయ్ ఆపై మణిపూర్ హైకోర్టు సీజేగా పదోన్నతిపై వెళ్లారు.
ఇప్పుడు సుప్రీమ్ కోర్టులో నాయమూర్తిగా నియామకం అయ్యారు. ఈ మేరకు గత శనివారం రాష్ట్రపతి అనుమతిస్తూ ఉత్తరువులు జారీ చేశారు.
దీంతో మరో తెలుగు వాడిగా సంజయ్ కుమార్ సుప్రీమ్ కోర్టులో న్యాయ మూర్తిగా అడుగు పెట్టారు.

What do you think?

“తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుంది” – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

మళ్ళీ రంగంలోకి దిగిన సమంత.మస్త్ కుష్ అవుతున్న ఫ్యాన్స్.