in

“తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుంది” – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెలాఖరున తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు 50 వేల మెజారిటీ రాకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.
వివరాల్లోకి వెళ్తే గత ఆదివారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు 50 వేల మెజారిటీ వస్తుందని ఉత్తమ్ కుమార్ అన్నారు. ఒకవేళ అలా 50 వేల మెజారిటీ రాకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.

ఉత్తమ్ కుమార్ 2018 అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఐతే కోదాడ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన భార్య పద్మావతి ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన ఆయన ఆ స్థానం నుంచి విజయం సాధించారు.
దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అయన భార్య పద్మావతి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఐతే ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి గెలవగా.. పద్మావతి ఓటమి పాలయ్యారు.
రానున్న ఎన్నికల్లో మరోసారి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరచుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

What do you think?

ఆన్లైన్ వ్యభిచారం చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ గుట్టురట్టు చేసిన పోలీసులు.

సుప్రీమ్ కోర్టులో న్యాయమూర్తిగా అడుగుపెట్టిన మరో తెలుగోడు.