in ,

రాష్ట్రం లో ఫ్లెక్సీ రగడ తారా స్థాయికి…

రాష్ట్రం లో ఫ్లెక్సీ రగడ తారా స్థాయికి…

గల్లీ లీడర్ అయినా ఢిల్లీ లీడర్ అయినా ఫ్లెక్సీ లో ఫోటో ఉంటేనే పండగ లెక్క ఫీల్ అవుతారు. నిలువెత్తు మనిషి మన కళ్ళముందు నిలబడేటట్టు చూపించేవి ఫ్లెక్సీ లు ధర తక్కువ ప్రచారం ఎక్కువ. సామాన్య మానవుడు కూడా ఈరోజుల్లో శుభకార్యాలకు, అశుభ కార్యాలకు ఫ్లెక్సీ నే వాడుతున్నారు. అందుకే సందర్భమేదయినా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీ లు వెలుస్తున్నాయి. ఫలితం గ కాలుష్యం పెరిగిపోతుంది.

ఏపిలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ కాలుష్యం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్ ల వాడకం పై షరతులు విధించింది. విశాఖ వేదికగా సి ఎం జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీ ల వినియోగం పైన నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక పై బట్టతో ఫ్లెక్సీ లను తయారు చేయాలనీ ప్రభుత్వం సూచించింది. 2027 చివరి నాటికి ప్లాస్టిక్ పొల్యూషన్ లేని
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ గ మార్చడానికి ఈ ఫ్లెక్సీ నిషేధం మొదటి అడుగు గా సి ఎం జగన్ అభిప్రాయం పడ్డారు.

ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ, ఇప్పటికిప్పుడు ఫ్లెక్సీ లు బాన్ చేస్తే ఎలా బతికేదంటూ ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఫ్లెక్సీ లను బాన్ చేయడం సరి కాదని వ్యాపారులు అంటున్నారు. సర్కార్ సడన్ నిర్ణయం తో తీవ్రం గా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లెక్సీ ప్లాస్టిక్ కాదని యూవీ 35 జి ఉన్న బ్యానర్ ప్రమాదకరం కానీ తాము యూ వీ 340 జి ఉన్న మెటీరియల్ మాత్రమే వాడుతున్నామని చెబుతున్నారు. ఇది ఫాబ్రిక్ కు సంబందించిందనేనని, ఫాబ్రిక్ తో తయారైన ఫ్లెక్సీ పై గ్లాసీ లుక్ కోసం చిన్న ప్లాస్టిక్ లేయర్ వేస్తారని పర్యావరణానికి ఇది హాని కాదని ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ చెప్తుంది. ఆ ప్లాస్టిక్ లేయర్ ను వేయడం మానేస్తే అది క్లాత్ కు సమానమేనని ఫ్లెక్స్ ప్రింటింగ్ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

గ్రామాల నుండి పట్టణాలవరకు విస్తరించిన ఫ్లెక్సీ రంగం పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తం తొమ్మిది వందల ఫ్లెక్సీ ప్రింటింగ్ మెషిన్ లు. అనుబంధ రంగా లయిన ఐరన్ షాప్ లు, ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ లాంటి విభాగాల్లో యాభై వేలకు పైగా జీవనోపాధి పొందుతున్నారు అంటున్నారు. 20 లక్ష ల రూపాయల ఒక ఫ్లెక్సీ యూనిట్ ఆపరేషన్ కోసం దాదాపు తొమ్మిది మంది వర్క్ చేస్తారని, ఇక ప్రింటింగ్ పూర్తయ్యాక అనేక విభాగాల్లో ఉండేవారి జీవనం ప్రశ్నర్ధకం గ మారుతుందని ఆందోళన వ్యక్తం చేసారు.

ఇపుడున్న ఫ్లెక్సీ ప్రింటింగ్ మెషిన్ తో ఏదైనా బ్యానర్ ప్రింట్ చేయాలంటే వెంటనే నిమిషాల వ్యవధి లో చేయొచ్చు, కానీ ప్యూర్ క్లాత్ తో ఫ్లెక్సీ ప్రింట్ చేయాలంటే నాలుగు నుండి అయిదు గంటలు సమయం పడుతుంది. క్వాలిటీ కూడా మైంటైన్ చేయలేము.

ఇపుడు ఒక అడుగు ఫ్లెక్సీ కి మూడు వందల రూపాయలు అవుతుంది. అదే ఫ్లెక్సీ ని క్లాత్ పైన వేస్తే అడుగు 32 రూపాయల చొప్పున తొమ్మిది వందల రూపాయలవుతుంది. తొమ్మిది వందల రూపాయలతో సామాన్య మానవుడు నార్మల్ క్లాత్ మీద వేసుకునే వీలుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జన విజ్ఞాన ప్రతినిధులు కూడా సర్కార్ అనుసరిస్తున్న తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ను పెంచి పోషిస్తున్న వారి ని వదిలేసి వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లెక్సీ బాన్ పై మరొక సారి పునరాలోచించి తగిన ప్రత్యామ్నాయం వచ్చే వరకు సమయం ఇవ్వాలని ఫ్లెక్సీ ఓనర్స్ అసోసియేషన్ మరియు అనుబంధ వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

నెమ్మదిగా రాష్ట్రం లో ఫ్లెక్సీ రగడ తారా స్థాయికి…

What do you think?

మానసిక ప్రశాంత ఆవశ్యకతపై క్రిస్టియానో రోనాల్డో..

ఫిట్ గ ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే..