పర్యటన కోసం మన తెలుగు రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కీలక నేత శ్రీ అమిత్ షా, నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని సికింద్రాబాద్ లోని నోవాటెల్ హోటల్లో కలుసుకుని అభినందించారు. కేవలం అభినందనలకు మాత్రమే తమ విలువైన సమయాన్ని అమిత్ షా జి కేటాయించారా?! ఇది ప్రతి ఒక్కరి లొ కలుగుతున్న సందేహం. రాజకీయ ప్రత్యర్థులపై ఎంతో తెలివిగా పావులు కదుపుతూ విజయవంతంగా పరిపాలన సాగిస్తున్న మోడీజీ ఆటలొ భాగమే ఈ భేటీ! అనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ గారు, తనకు రాజకీయ ఆసక్తి లేదని చెబుతున్నారు. 2009 ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన గడబిడలే అందుకు కారణం అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.
స్టార్ గా ఎదిగిన మన జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయ ప్రవేశానికి ఆహ్వానిస్తూ కేంద్రం నుంచి పిలుపు వస్తే, ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. ఎవరి నిర్ణయాలు ఏమైనప్పటికీ ఈ భేటీ రాజకీయ సమీకరణాలను మారుస్తుందని విశ్లేషకుల అంచనా…