in ,

తారా కాలికో మిస్టరీ స్టొరీ! అసలు తనకేమైంది..?

తారా కాలికో మిస్టరీ స్టొరీ

సెప్టెంబరు 20,1988లో న్యూ మెక్సికోలోని బెలెన్‌కు చెందిన తారా కాలికో తన తల్లి బైక్‌ను తీసుకుని బయటకు వెళ్లింది. తారా బ్యాంక్ టెల్లర్‌గా పని చేస్తూ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ అవ్వడానికి చదువుతోంది. ఆ మధ్యాహ్నం టెన్నిస్ ఆడాలని ప్లాన్ చేసుకున్న తారా ఒకవేళ టైర్ పగిలిపోయి,మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి రాలేకపోతే తన తల్లిని బయటకు వెళ్లమని కోరింది. అలా చెప్పి వెళ్లిన తారా మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం తన తల్లిదండ్రులు పోలీస్ కప్లైంట్ ఇచ్చి ఎంతగా వెతికి చూసినా ఫలితం లేకపోయింది. ఇక ఆశలు వదిలేసుకునే తరుణంలో ఒక సంవత్సరం తరువాత ఆమె వయస్సు ఉన్న యువతి మరియు తప్పిపోయిన ఒక చిన్న పిల్లాడు నోటికి టేప్లు వేసి ఉన్న ఒక ఫోటో పోలీసులకు దొరికింది.

ఫ్లోరిడాలోని జూనియర్ ఫుడ్ స్టోర్ వెలుపల ఉన్న పార్కింగ్ స్థలంలో ఈ ఫోటో దొరికింది. తొమ్మిదేళ్ల మైఖేల్ హెన్లీ,1988 ఏప్రిల్‌లో తన తండ్రితో కలిసి టర్కీలను వేటాడుతున్నప్పుడు తారా కాలికో ఉన్న ప్రాంతంలోనే తప్పిపోయాడు. వ్యాన్ వెనుక భాగంలో వీరిద్దరూ ఉన్నట్టు కనపడిన ఆ ఫోటోలో వీ.సీ.యాండ్రూస్ రాసిన ఒక పుస్తకం వారి పక్కన కనిపించింది. ఆ రచయిత తారాకు ఇష్టమైన రచయిత కావడంతో అది తారానే అని అందరూ నమ్మారు. తారా తల్లి మాత్రం ఆ అమ్మాయి తారా కాలికో కాదని చెప్పుకొచ్చినప్పటికీ ఫోటోలో ఉన్న అమ్మాయికి కాలికో లాంటి మచ్చ ఉండడంతో ఆ ఫోటోలో ఉన్నది తనేనని నమ్మక తప్పలేదు.

 

కానీ ఇప్పటికీ ఆ ఫోటోపై సరైన స్పష్టత లేకపోవడం,బలమైన సాక్షాలు దొరకకపోవడం వల్ల ఆ ఫోటోను నిపుణులు తోసిపుచ్చారు. 1990లో మైఖేల్ హెన్లీ మృతదేహం అతను వేటాడుతున్న జుని పర్వతాలలో దొరకడంతో వారిద్దరిని అపహరించి ఫ్లోరిడాకు తీసుకువెళ్ళారన్న సిద్ధాంతాన్ని చాలా మంది కొట్టిపారేశారు. కొంత కాలం తారా కాలికో తల్లిదండ్రులే ఆమెను చంపి ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచారని పుకారులు పుట్టుకొచ్చినప్పటికీ దానికి సరైన ఆధారాలు లేవు. 2002లో తారా తల్లితండ్రులు తన కూతురి ఆచూకీ తెలియకుండానే చనిపోయారు.

 

ఈ ఏడాదితో తారా కాలికొ అదృశ్యమై 24 సంవత్సరాలు గడిచినా తారా కేస్ ఇప్పటికీ ఓపెన్లోనే ఉంది. తార కాలికో చనిపోయిందా…తన తల్లదండ్రులే చంపి ఆ విషయం దాచేశారా…లేక ఆమెను ఎవరైనా అపహరించారు…ఇలా ప్రశ్నలు ఎన్నో. కానీ ఆమెకు ఏమైందన్న దానికి సమాధానం మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది.

What do you think?

మన శరీరంలో ఆశ్చర్యపరిచే 5 అవయవాలు…

అతనొక ఛాయ్ వాలా.అయితేనేం బ్యాంకుతో పోరాడి గెలిచాడు