in ,

మన శరీరంలో ఆశ్చర్యపరిచే 5 అవయవాలు…

ఆశ్చర్యపరిచే 5 అవయవాలు

 

ఈ ప్రపంచంలో మనుషులను ఆశ్చర్యపరిచేవి చాలానే ఉన్నాయి. అయితే భూమి మీద ఎన్ని విచిత్రాలు ఉన్నాసరే ఎప్పటికీ మనుషులను అబ్బురపరిచేది వారి శరీరమే. మనం గాలి పీల్చుకునే దగ్గర నుంచి నడవడం వరకు వాటి పని చేసే తీరును అర్థం చేసుకోవడం సులువుగా కనిపిస్తున్నప్పటికీ క్లిస్టమైనది. అలాంటి శరీరంలో మనకి తెలియకుండా పని చేస్తూనే ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు ఈ రోజు తెలుసుకుందాం.

 

1.కళ్ళు

మనం రోజూ పరిసరాలను చూస్తూ అన్ని గమనిస్తున్నాం అంటే మన కళ్లే కారణం. అటువంటి కను రెప్పలను వాల్చడంలో కూడా ఆశ్చర్యం ఉందట. మన శరీరం మొత్తంలో అత్యంత వేగంగా కదిలేవి కళ్ళలోని “ఆర్బిక్యులరీస్ అక్యులి” అనే కండరాలేనట. మనం 100 నుంచి 150 సెకన్లకి ఒకసారి కను రెప్పలను వాలుస్తామట. అయితే మనం మాట్లాడేటప్పుడు కన్నా చదివేటప్పుడు తక్కువ మోతాదులో రెప్పలు ఆర్పుతామట. ఇందువల్లే మాట్లాడేటప్పుడు కన్నా చదివేటప్పుడు ఎక్కువగా అలసిపోతామట.

 

2.చర్మం

బయట రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత,కాలుష్యం నుంచి కాపాడుతూ తగిలిన గాయాలను తగ్గించడంలో చర్మం సహాయపడతుందని మనకు తెలిసిందే. అయితే మన శరీరంలో ఉండే అన్ని అవయవాలకంటే పెద్ద అవయవం చర్మమేనట. మన పూర్తి శరీరంలో ఒక్క చర్మం బరువు మాత్రమే 15 శాతం ఉంటుందట. మన చర్మం పనితీరు ఎవరికి అంతగా ఆశ్చర్యం కలిగించనప్పటికీ అది మరీ వదులుగా ఉండకుండా మరీ గట్టిగా కండరాలకి అతుక్కునేలా ఉండకుండా మనం సులువుగా కదలడానికి సహాయపడుతుందట.

 

3.రక్త నాళాలు

మన శరీరంలో ఉండే ప్రతి అణువుకి రక్తం అందించి పనిచేసేలా సహాయపడేవి రక్త నాళాలు. అటువంటి రక్తనాళాలు ఒక ఎదిగిన మనిషి శరీరంలో 1,00,000 మైళ్ళ వరకు విస్తరించి ఉంటాయట. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. అలా ఉండటం వల్లనే మన గుండెకు,ఊపిరి తిత్తులకు,చేతులకు,కళ్ళకు ఇలా ప్రతి అవయవానికి రక్తం పండడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పని చేసేలా చేస్తాయట.

 

4.ముక్కు

ఊపిరి పీల్చడం సులువుగా మనకు తెలియకుండా జరిగే పని అయినప్పటికీ దానికీ శరీరంలోని వాటికి సమానమైన ప్రాధాన్యత ఉంది. సగటు మనిషి రోజుకీ 20,000 సార్లు ఊపిరి పీలుస్తాడట. మగవారితో పోలిస్తే చిన్న పిల్లలు,ఆడవారు వేగంగా పీలుస్తారట. మనం గాలిని పీల్చే విధానమే మన ఆకలిని,జీవించే సమయాన్ని నిర్ణయిస్తుందట. గాలిని నెమ్మదిగా పీల్చడం ద్వారా ఒకరి ఆయువు కూడా పెరుగుతుందట. అయితే ఊపిరి పీల్చేటప్పుడు ముక్కుతో పీల్చడం ద్వారా బ్యాక్టీరియాను,కాలుష్యాన్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవచ్చట.

 

5. పళ్ళు

దెబ్బ తగిలితేనో, పాడైపోవడం వల్లనో సులువుగా ఊడిపోయే పళ్లకు కూడా తన ప్రత్యేక స్థానం ఉందట.మనుషుల పళ్లు కూడా సొర చేపల పళ్ళంత బలంగా ఉంటాయట. పూర్తి శరీరంలో ఉండే కాల్షియంలోని 99 శాతం పళ్ళలోనే ఉంటుందట. మరింత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే నాలుకతో పాటు పళ్లు కూడా లోపలి నుంచి వచ్చే గాలిని అవసరమైన విధంగా బయటకి పంపిస్తూ మనం మాట్లాడడానికి సహాయపడతాయట.

What do you think?

స్వతంత్రం తర్వాత నిర్మించబడ్డ అందమైన నిర్మాణాలు

తారా కాలికో మిస్టరీ స్టొరీ! అసలు తనకేమైంది..?