in ,

గర్భంలోని బిడ్డ గుండెకు ఆపరేషన్ చేసిన వైద్యులు!

వైద్యులు అరుదైన ఆపరేషన్స్ చేశారని వింటూ.. ఉంటాం. కానీ ఇటీవల డిల్లీలో వైద్యులు అరుదులోనే అరుదైన ఆపరేషన్ చేసి శబాష్ అనిపించుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని ఓ 28 ఏళ్ల మహిళకు మునుపు మూడు సార్లు అబార్షన్ జరిగింది. అయితే ప్రస్తుతం మహిళ కడుపులో పెరుగుతున్న బిడ్డకు గుండెలో సమస్య ఉందని, కవాటం (valve) మూసుకుపోయిందని వైద్యులు తెలిపారు. కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే బిడ్డను కనే తీరుతానని ఆ మహిళ చెప్పడంతో ఎయిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నారు.

ద్రాక్ష పండు అంత సైజులో ఉండే బిడ్డ గుండెకు కేవలం 90 సెకన్లలో ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా ఆపెరేషన్ చేసి శబాష్ అనిపించుకున్నారు.

ఈ విషయం పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మనుషుక్ మాండవీ ” కేవలం 90 సెకన్లలో ద్రాక్ష పండు అంత సైజులో ఉండే బిడ్డ గుండెకు ఆపరేషన్ చేసిన దిల్లీ ఎయిమ్స్ వైద్యులకు అభినందనలు” అంటూ ట్వీట్ చేయగా.. ప్రధాని మోదీ రీట్వీట్ చేసి వైద్యులను మెచ్చుకున్నారు.

”భారతీయ వైద్యుల సృజనాత్మకతకు గర్వపడుతున్నా” అని అభినందిస్తూ మోదీ ట్వీట్ చేశారు.

What do you think?

రైతులకు శుభవార్త!నెలకు రూ.3వేల పెన్షన్ పొందండిలా..

భారతీయులకు కెనడా ప్రభుత్వం షాక్!