in ,

లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు మీకోసం

లివర్ ను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు:

“ లివరో రక్షితి.. రక్షితః ”

మన శరీరంలో ప్రతి అవయవము మనకు ఎంతో ముఖ్యమైనది. అటువంటి అన్నీ అవయవములను ఎటువంటి కెమికల్స్ బారినపడకుండా, విషపూరిత ఆహారాన్ని కరిగించి బయటకు పంపించే అవయవం లివర్.

నేడు మానవుడు తీసుకునే ఆహారం అంతా రసాయనాల ప్రభావంతో కూడి ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఇలా అన్నింటి పైనా అవి పాడవకుండా రసాయనాలు చల్లుతారు. ఆ రసాయన ప్రభావం పోవాలంటే ఆహారాన్ని 400 డిగ్రీల కంటే ఎక్కువ మరిగించాలి.  ఇది సాధ్యమయ్యే పని కాదు వీలైనంత వరకు ఆకుకూరలను కూరగాయలను సొంతంగా పండించుకుంటే మనకు స్వచ్ఛమైన ఆహారం వస్తుంది . ఆహారం ద్వారా మన లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.

ఈ మధ్యన కనుగొన్న అధ్యయనాల ప్రకారం వెలగపండులో లివర్ ని రక్షించే పోషకాలు ఎన్నో ఉన్నాయని తెలిసింది. మన ఆహారంలో వెలగపండును వాడటం వల్ల మన లివర్ ని కాపాడుకోగలుగుతాము.

సాధ్యమైనంత వరకు రాత్రి తినే ఆహారము ఏడు గంటల లోపు తినేయాలి అలాగే ఉడికించిన ఆహారం కాకుండా పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు మొదలగు డ్రైఫ్రూట్స్ నానబెట్టి తీసుకోవాలి.

శరీరంలోకి ప్రవేశించిన విషపూరితాలను మన నుంచి వేరు చేసి మనలను రక్షించే లివర్ను రక్షించుకోవడం మన కర్తవ్యం.

What do you think?

హార్ట్ అటాక్ కి కారణాలు- తీసుకోవలసిన జాగ్రత్తలు.

ఇంట్లో పదార్ధాలతో మీ మొటిమలు మాయం చేసే చిట్కాలు.