in ,

హార్ట్ అటాక్ కి కారణాలు- తీసుకోవలసిన జాగ్రత్తలు.

 

హార్ట్ అటాక్ కి కారణాలు -జాగ్రత్తలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం, హార్ట్ అటాక్ లాంటి గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం చిన్నాపెద్దా తేడా లేకుండా 18 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి వెనుక ఉన్న ముఖ్య కారణాలను జాగ్రత్తలను ఇపుడు మనం తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి. హైగ్రీవ్ రావు నేతృత్వంలో మొత్తం 2153 మంది రోగులను అధ్యయనం చేసి మధుమేహం, బాడీ మాస్ ఇండెక్స్ మరియు నడుము తుంటి నిష్పత్తి వంటివి గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలని నిర్ధారించి ఆ ప్రమాద  కారణాలని రెండు భాగాలుగా వర్గీకరించారు

కారణాలు:

  1. రెగులర్ ప్రమాద కారణాలు : హైపర్‌టెన్షన్, డయాబెటిస్ మెల్లిటస్, ఎలివేటెడ్ LDL-C & స్మోకింగ్.
  2. నిర్దిష్ట జీవక్రియ ప్రమాద కారణాలు: BMI, నడుము తుంటి నిష్పత్తి, HDL-C, హైపర్ ట్రైగ్లిజరిడెమియా మరియు HbA1c

 

జాగ్రత్తలు:

*రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు, చురుకైన జీవితాన్ని గడపడం, వ్యాయామం చెయ్యడం, అధిక సమయం కూర్చొని ఉండకుండ వాకింగ్ & స్ట్రేట్చింగ్ చెయ్యడం,

*ఆల్కహాల్ ఇన్టేక్ తగ్గించడం, ధూమపానం తగ్గించడం, సరైన మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.

*పొటాషియం రిచ్ ఫుడ్స్, జ్యూస్, నట్స్ , వంటివి మన రెగ్యులర్ డైట్ లో భాగంగా చేస్కోవాలి, వీలు అయినంత వరకు అయిల్ ఫుడ్స్ అవాయిడ్ చెయ్యాలి.

What do you think?

పొట్ట తగ్గాలనుకుంటున్నారా?!అయితే ఈ చిట్కాలు మీకోసం

లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు మీకోసం