in ,

ఎక్సర్ సైజు తో పనిలేకుండా బరువు తగ్గండిలా…

బరువు తగ్గడానికి చిట్కాలు:

బరువు గురుంచి మాట్లాడితే అది ఎప్పుడూ సెన్సిటివ్ టాపిక్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్లు ఎప్పుడూ అంత సంతృప్తిగా ఉండరు. ప్రతి ఆడవాళ్లు ప్లాట్ స్టొమక్ అండ్ టోన్డ్ అర్మ్స్ తో స్లిమ్ గ ఉండాలని కోరుకుంటారు. కానీ బరువు  తగ్గడం అనుకున్నంత సులవు కాదు. ఈ ప్రాబ్లెమ్ వర్కింగ్ ఉమెన్స్ కి మరింత ఎక్కువ ఉంటుంది. వర్కింగ్ అవర్స్ నుండి బయటికి వచ్చాక, జిం కి వెళ్లి వర్కౌట్ చేయాలంటే ఒక లాంటి బద్ధకం. స్ట్రెస్ కూడా మీరు బరువు పెరగడానికి ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు దీనికి తోడవుతుంది జంక్ ఫుడ్ మరియు మీ అన్ హెల్తీ లైఫ్ స్టైల్.

ఒక సారి ఊహించుకోండి. ఫ్యూచర్ లో ఈ రకమైన లైఫ్ స్టైల్ వల్ల చాల ప్రాబ్లమ్ వస్తుంది కానీ ఖచ్చితం గా ఏదో చేయాలి. అపుడు సెర్చ్ చేయడం మొదలెడతారు. తొందరగా, వేగంగా వితౌట్ ఎక్సర్ సైజు ఎలా బరువు తగ్గాలా అని, సరిగ్గా ఈ ఆలోచనే నేను ఈ ఆర్టికల్ రాయటానికి కారణం. మీరు తొందరగా, వేగంగా, వర్కౌట్స్ లేకుండా సింపుల్ గా బరువు తగ్గటం ఎలా?

సో లెట్స్ గెట్ ఇన్ టు .. టాపిక్..

తొందరగా వేగంగా వితౌట్ ఎక్సర్ సైజు ఎలా బరువు తగ్గాలి దీనికి సింపుల్ సొల్యూషన్ ఈ నాచురల్ రెసిపీస్

సింపుల్ అండ్ నో టైం టేకింగ్, మరింత రుచిగా కూడా …..

రెడీ అవండి మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్య పోయే అద్భుతమైన రోజుకోసం.

ఈజీ గా నాలుగు కిలోల వరకు తగ్గుతుంది. ఫాలో స్టెప్స్

  1. జింజర్ టీ

ముందుగా ఒక అల్లం ముక్కను లేదా 1/2 టీస్పూన్ జింజర్ పొడి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మీడియం సైజు రెండు నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి దాని రసాన్ని ఒక గ్లాస్ లోకి పిండి పక్కన పెట్టుకోండి, రసాన్ని పిండేసిన తొక్కలను బౌల్ లోకి తీసుకొని దానికి కట్ చేసిన అల్లం ముక్కలను చేర్చి, రెండు గ్లాస్ ల వాటర్ ను మిక్స్ చేసి అయిదు నిముషాలు మరిగించండి. అయిదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోయండి. దానికి నిమ్మ రసాన్ని చేర్చి మరింత రుచి కోసం 1 టేబుల్ స్పూన్ హనీ ని చేర్చి బాగా కలపండి.

ఇపుడు మీ వెయిట్ లాస్ రెసిపీ రెడీ. రోజుకి మూడు సార్లు మీల్ టైం కి వన్ అవర్ బిఫోర్ దీన్ని తీసుకోండి.

మొదటి అడుగు పడిందిలా మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్య పోయే అద్భుతమైన రోజుకోసం.

  1. లైమ్ అండ్ రాస్బెర్రీ స్మూతీ

మీరు గనక స్మూతీ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్ గా ఇది మీకు నచ్చుతుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ ఆసిడ్ మీ జీర్ణవ్యవస్థను మెరుగు పరచడమే గాక మీ మెటాబాలిజమ్ ను బూస్ట్ చేస్తుంది.

రాస్బెర్రీస్ కాలరీస్ తక్కువగా ఉండే ఫైబర్ తో కూడిన ఆహారం ఇది. ఫైబర్ ఉండడం వల్ల డైజీషన్ నెమ్మదిగా జరగటమే కాదు, కడుపు నిండుగా ఉండి ఆకలి తొందరగా వేయదు. వీటన్నిటి వల్ల మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ ను పొందుతారు. లైమ్ అండ్ రాస్బెర్రీ స్మూతీ చేయడం చాల సులభం

ఒక గ్లాస్ లోకి నిమ్మ రసాన్ని పిండి, కొన్ని రాస్బెర్రీస్ వేసి దానికి ఒక గ్లాస్ వాటర్ ను చేర్చండి. ఈ మిశ్రమాన్ని జ్యూసర్ లో వేసి బాగా కలిసి రంగు మారేవరకు బ్లెండ్ చేస్తే సరి. రెడీ అయిన ఈ స్మూతీ ని వారానికి రెండు సార్లు తాగితే చాలు. మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్య పోతారు.

  1. తేనే కల్పిన దాల్చినచెక్క రసం..

ఇప్పటికే మీరు గమనించి ఉంటారు. ప్రతి రెసిపీ లోని హనీ ని కామన్ గా కంటిన్యూ చేస్తున్నాను. బరువు తగ్గడానికి తాగే అన్ని రెసిపీస్ లోను హనీ ని వాడవచ్చు. ఇపుడు దీన్ని దాల్చిన చెక్కతో చేర్చి మరొక కొత్త రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను. ఏదైతే తొందరగా తగ్గడానికి సమయం పడుతుందో దాన్ని పూర్తిగా తీసేస్తుంది. ఈ డ్రింక్ మీ ఎఱ్ఱామినల్ బాడీ ఫాట్ కు భలే పనిచేస్తుంది.

చేయడం చాల సులభం:

ఈ రెసిపీ లో రెండు టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో కలిపి అరగంట మరిగించండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ హనీని వేయండి. ఇందులో చేర్చిన అన్ని ఇంగ్రిడిఎంట్స్ బాగా కలిసి రంగు మారే వరకు కలుపుతూ ఉండండి. పరగడుపున ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మీ బెల్లీ ఫాట్ తొందరగా తగ్గుతుంది.

  1. కుకుంబర్ అండ్ గ్రేప్ ఫ్రూట్ మిక్స్

ఇప్పటివరకు చెప్పిన అన్ని రెసిపీల కన్నా ఇది కొంచెం కష్టం. కానీ ఇది ఇచ్చే రిజల్ట్స్ చూసి మీరు దీన్ని ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఎదురు చూస్తారు. కుకుంబర్ లో వాటర్ ఎక్కువ ఉండి పాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గ్రేప్ ఫ్రూట్స్ AMP ఆక్టివ్ ప్రోటీన్ ను కల్గి ఉంటాయి. ఇది ఫాట్ ను వేగంగా బర్న్ చేస్తుంది. ఇక లెమన్ గురుంచి చెప్పాలంటే విటమిన్ సి ఉంటుంది.

తయారీ విధానం:

కొన్ని కట్ చేసిన కుకుంబర్ ముక్కలను తీసుకొని, దానికి ఒక లెమన్ ను, చేర్చి కొన్ని మీడియం సైజు గ్రేప్ ఫ్రూట్స్ ను వేయండి. ఒక కప్ వాటర్ ను ఆడ్ చేసి బాగా బ్లెండ్ చేయండి. దానిలో కొన్ని పుదీనా ఆకులను కూడా వేయండి. బాగా బ్లెండ్ అయిన తర్వాత కాసేపు ప్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయినతరువాత తీసుకోండి.

ఇది హెల్తీ అండ్ రీఫ్రెషింగ్ జ్యూస్.

మీ బాడీ ఎంజాయ్ చేస్తుంది.

What do you think?

ఇంట్లో పదార్ధాలతో మీ మొటిమలు మాయం చేసే చిట్కాలు.

సిరివెన్నెల

మన్నధుడ్ని మసి చేసిన సిరివెన్నెల “చలువ”