in ,

అల్జీమర్స్ ను అధిగమించడానికి కొన్ని చిట్కాలు

సహజంగా వయసు పెరిగేకొద్దీ మరపు అనేది వస్తూ ఉంటుంది. మర్చిపోయే లక్షణాన్ని అల్జీమర్స్ అంటారు. సాధారణంగా మగవారి కంటే మహిళలే ఎక్కువ బాధితులని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆడవారికి మోనోపాజ్ దశ తర్వాత ఈ ఇబ్బంది తలెత్తుతుందని చెబుతారు. ఎందుకంటే  మోనోపాజ్ లో ఈస్ట్రోడియల్ తో పాటు మరి కొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈస్ట్రోడియల్ మెదడులో పనిచేసే ఒక హార్మోను,  దీని తగ్గుదల కారణంగా అక్కడి కణాల తయారీ.. వాటి పనితీరు పై ప్రభావం పడి దాని వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అయితే ఇది భయపడేంత పెద్ద జబ్బేమీ కాదు, దీనిని నివారించుకోవచ్చు. శారీరక వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. మెదడుకు కూడా వ్యాయామం ఉండాలి,  చిన్న చిన్న లెక్కలు కావాల్సిన వాళ్ళ ఫోన్ నెంబర్లు అడ్రస్ లు మొదలగునవి ఫోన్ పై ఆధార పడకుండా ఉండాలి. భౌతిక పరమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి.

దీని నివారణకు మంచి ఆహారం కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. పళ్లూ, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని భుజించాలి. ఎప్పటికప్పుడు ప్రతిదీ గుర్తు చేసుకుంటూ జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. సంగీతం నేర్చుకోవడం, చెస్, సు డో కు ఆడటం, లాంటివి ఏ వయసు వారికైనా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మనిషికి మరపు అనే సమస్య చాలా సమస్యలకు మూలం అవుతుంది,  కాబట్టి ముందే జాగ్రత్త పడి ఆ  మరపు అనే విషయాన్ని మర్చిపోండి.

What do you think?

గుండె ఆరోగ్యానికి పంచ (5) సూత్రాలు

పొట్ట తగ్గాలనుకుంటున్నారా?!అయితే ఈ చిట్కాలు మీకోసం