in ,

గుండె ఆరోగ్యానికి పంచ (5) సూత్రాలు

గుండె ఆరోగ్యానికి పంచ (5) సూత్రాలు

2020 నుంచి ప్రపంచంలో అందరూ ఎదుర్కొన్న, ఇంకా ఎదుర్కొంటున్నా గడ్డు సమస్య కోవిడ్. ఇంచుమించు అందరి జీవితాల్లోకి వచ్చి వెళ్ళిపోయింది…కోవిడ్ తగ్గిపోయిన తరువాత కూడా మనిషి శరీరంలోని అవయవాలపై దాని ప్రభావం చూపెడుతోంది. మన శరీరంలోని ప్రతి అవయువం విషయంలోనూ ఎంతో జాగ్రత్త అవసరం , అలా జాగ్రత్త పడాల్సిన వాటిలో గుండె ఒకటి. ఆరోగ్యవంతుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది ఇది తక్కువ కొట్టుకున్నా ఎక్కువ కొట్టుకున్న ప్రమాదమే.

  • గుండె ఆరోగ్యానికి పంచ సూత్రాలు:

*ఎంతటి విషయమైనా, ఉద్వేగం చెందకూడదు. ఆలోచనలతో మన గుండెపై ఒత్తిడి ఇవ్వకూడదు. సరిపడినంత గాలి ఊపిరితిత్తుల ద్వారా తీసుకోవాలి.

*హింసను ప్రేరేపించే సినిమాలు, షో లకు దూరంగా ఉండాలి. వీలైనంత తక్కువ చూడాలి. దాని ప్రభావం కూడా మన గుండెపై పడుతుంది.

*ఆహారంలో వాడే ఉప్పును వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధ్యయనాల ప్రకారం మనం రోజూ తీసుకునే ఆహారంలో పావు టీ స్పూన్ ఉప్పు మాత్రమే ఉండాలి. ఆహారంలో ఉప్పు వాడకం ఎక్కువైతే హై బ్లడ్ ప్రెజర్ వస్తుందన్న సంగతి అందరికీ తెలిసినదే, కానీ దానివల్ల కలిగే నష్టం ఏమిటంటే ఇది మన శరీరంలోని రక్తనాళాలను డామేజ్ చేస్తుంది, దాని ఫలితంగా అక్కడ కొవ్వు చేరుకుంటుంది.  అది ఎన్నో గుండెజబ్బులకు కారణమవుతుంది.

*అసలు వ్యాయామం చేయకపోవడం, అలాగే అధిక వ్యాయామం చేయడం కూడా గుండె ప్రమాదాలకు కారణమవుతోంది, అందుకని వ్యాయామం కూడా సరైన క్రమంలో సరైన పద్ధతిలో ఉండాలి.

*పరగడుపున వెల్లుల్లి, యాలకులు తీసుకోవడం గుండెకు మంచిది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను తీసుకోవాలి, అధిక బరువును తగ్గించుకోవాలి, మొదలైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత వరకు గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

What do you think?

గురువు ను నమ్మినడుచుకునే విద్యార్థి ఎప్పుడూ చెడడు.

అల్జీమర్స్ ను అధిగమించడానికి కొన్ని చిట్కాలు