in ,

ఇంట్లో పదార్ధాలతో మీ మొటిమలు మాయం చేసే చిట్కాలు.

మొటిమలు మాయం చేసే చిట్కాలు:

సిటీలలో పెరుగుతున్న కాలుష్యం వల్ల, రోజు రోజుకు ప్రకృతిలో వస్తున్న మార్పుల వల్ల, గాడి తప్పిన ఆహారపు అలవాట్ల వల్ల మొహంపై మొటిమలు, మచ్చలు రావడం సహజంగా మారింది. కానీ ఇంట్లో అందుబాటులో ఉండే పదార్ధాలతోనే వాటిని మాయం చేయవచ్చని చాలా మందికి తెలియదు. మన ఇంట్లో మనం రోజూ ఉపయోగించే, సులువుగా దొరికే కొబ్బరి నూనె,పసుపు,బంగాళదుంప, కలబంద మొదలైన వాటితో మచ్చలను, మొటిమలను చాలా సులువుగా తగించుకోవచ్చు.

1.కొబ్బరి నూనె

ఇంట్లో మనం రోజు వాడే కొబ్బరి నూనెను ఒక చెంచాడు తీసుకుని, అరచేతులతో రుద్ది మొహంపై మొటిమలు వచ్చిన ప్రదేశంలో నెమ్మదిగా అద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై దురదలను తేలికపాటి చేస్తుంది. కొబ్బరి నూనెలో K,E విటమిన్లు ఉండటం వల్ల బ్యాక్టీరియాను ఎదురుకుంటూ రోగ నిరోధక శక్తి పెంచి దురదలను తగ్గించి కొత్త మొటిమలు రాకుండా, మచ్చలను తగ్గిస్తూ చర్మానికి సాయం చేస్తుంది. మొహంపై అద్దుకున్న నూనెను ఆ రాత్రంతా అలా ఉంచి, లేచిన తరువాత కడిగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

2.పసుపు

ఒకటి లేదా రెండు చెంచాలు పసుపు, ఒక చెంచాడు నిమ్మకాయ రసం తీసి కలుపుకుని, నెమ్మదిగా మొహంపైన ఫేస్ మాస్క్ లాగా రాసుకుని 30 నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా రోజూ చేయటం వల్ల మొహంపై మచ్చలు రాకుండా మొహాన్ని ప్రకాశింపచేస్తుంది.

3.బంగాళదుంప

బంగాళాదుంపను ముక్కలుగా చేసుకుని, ఒక ముక్కను మొహంపై మొటిమలు లేదా నల్లమచ్చలు వచ్చిన ప్రదేశంలో నెమ్మదిగా గుండ్రంగా 10 నుంచి 15 నిమిషాల వరకు రుద్దుకోవాలి. ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల నల్లమచ్చలు,మొటిమలు తగ్గుతాయి. మొహంపై ఉండే జిడ్డు పోయి ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

4.కలబంద

మొహంపై మొటిమలు, నల్లమచ్చలు పోవడానికి సరైన పరిష్కారం కలబంద. కలబందలోని గుజ్జును తీసి మొటిమలు, నల్లమచ్చలు వచ్చిన ప్రదేశంలో నెమ్మదిగా రాసి రాత్రంతా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల కలబందలో ఉండే విటమిన్ C,E మొహంపై మొటిమల వల్ల వచ్చిన మచ్చలను, మంటను తగిస్తుంది.

ఈ విధంగా మనం రోజూ మన ఇంట్లో వాడే పదార్ధాలతోనే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.

What do you think?

లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు మీకోసం

ఎక్సర్ సైజు తో పనిలేకుండా బరువు తగ్గండిలా…