in

రైతులకు శుభవార్త!నెలకు రూ.3వేల పెన్షన్ పొందండిలా..

రైతులకు ఆసరాగా ఉండడం కోసం ఇప్పటికే రకరకాల పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వయసు పైబడిన రైతుల కోసం పీఎం కిసాన్ యోజనా (pm kisan yojana) అనే మరో కొత్త పథకాన్ని అమలుచేయబోతోంది. ఈ పధకం ద్వారా 60 ఏళ్ల వయసు వాళ్ళు నెలకు రూ.3వేల పెన్షన్గా పొందవచ్చు.

ఈ పథకంలో చేరాలంటే దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి. అందులో 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమి కలిగి ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు 60 ఏళ్లు వచ్చే వరకు నెలవారీ చందాగా రూ. 55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయసు దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది. ఒక వేళ అర్హుడైన వ్యక్తి మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్ వస్తుంది. అయితే ఇది అతడి పిల్లలకు వర్తించదు. 60 ఏళ్లు నిండక ముందు పింఛన్ అందదు.

ధరకాస్తుకు కావాల్సినవి:

దరఖాస్తుదారుడు ఆధార్కార్డు, బ్యాంకు పాస్బుక్, పేరు, పుట్టిన తేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, జీవిత భాగస్వామి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అర్హత గల రైతులు తమ ప్రాంతంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్/ మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

What do you think?

” ఆస్కార్ ” అందుకుని అదరగొట్టిన ఆర్ఆర్ఆర్ టీం

గర్భంలోని బిడ్డ గుండెకు ఆపరేషన్ చేసిన వైద్యులు!