in ,

నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మూన్ ల్యాండింగ్ బూటకమా…?

మూన్ ల్యాండింగ్ బూటకమా…?

అన్ని దేశాలకంటే ముందుగా అపోలో 11తో చెంద్రునిపై కి చేరుకుని ఎవరూ ఊహించని రీతిలో అందర్నీ ఆశ్చర్యపరిచిన దేశం అమెరికా. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మానవాళిని అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లిన ఈ అపోలో 11ని పుకారులతో,అర్థంలేని ప్రశ్నలతో విమర్శించేవారు చాలామందే ఉన్నారు. ఈ విమర్శకులు అలా వివాదాస్పదమైనది ప్రశ్నలను ఎందుకు లేవనెత్తుతున్నారో ఈ రోజు మనం తెలుసుకుందాం.

అమెరికా వ్యోమగాములు చెంద్రునిపైకి చేరిన కథ.

1961లో అగ్ర దేశమైన అమెరికా మరియు రష్యాకు మధ్య అంతరిక్షాన్ని చేరుకునే కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో రష్యాకు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్షంలోకి చేరుకున్న మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. దానికి కొన్ని సంవత్సరాల ముందే 1957లో రష్యా అంతరిక్షంలోకి మనుషులతో తయారు చేయబడిన స్పుట్నిక్ అనే సాటిలైట్ను మొదటి సారిగా భూ కక్షలోకి పంపి అమెరికాను అభివృద్ధిలో వెనకకు నెట్టేసింది.

దీనితో ఎలాగైనా రష్యా కంటే ఒక అడుగు ముందు ఉండాలన్న ఉద్దేశంతో యూరి గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన కొన్ని రోజులలోనే అమెరికా అధ్యక్షుడైన జాన్ ఎఫ్.కెన్నెడీ ఇంకో పది సంవత్సరాల్లో చంద్రునిపై మానవులను అడుగుపెట్టేలా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అప్పటి నుంచి అమెరికా మనుషుల్ని చంద్రునిపైకి తీసుకువెళ్ళడమే లక్ష్యంగా పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్లు కోరుకున్న విధంగానే జూలై 16, 1969న వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్,బజ్ ఆల్డ్రిన్ మరియు మైఖేల్ కాలిన్స్ను అపోలో 11లో అతరిక్షంలోకి పంపారు. సరిగ్గా నాలుగు రోజుల తరువాత,జూలై 20, 1969న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించాడు.

అతను మరియు ఆల్డ్రిన్ మూడు గంటల పాటు చంద్రునిపై నడిచి చంద్రుని ధూళి మరియు రాళ్లను భూమిపై పరీక్షించడం కోసం సేకరించారు. మనుషులు చంద్రునిపైకి వచ్చారని తెలియచేస్తూ మేము ఇక్కడకి మనుషులు గ్రహం నుండి వచ్చాం,చంద్రునిపై జూలై 1969న మొదటి సారిగా అడుగు పెట్టాం,మేము శాంతిని కోరుతూ వచ్చాంఅంటూ సంకేతాన్ని వదిలారు.

అదే విధంగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తమ దేశ జెండాను అక్కడ చంద్రునిపై పాతి జూలై 24,1969న ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ అనుకున్న విధంగానే ఎవరూ కలలో కూడా ఊహించలేనిది సాధించి రష్యాను కోల్డ్ వార్లో వెనక్కు నెట్టేసాడు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది.

 

ప్రశ్నలు-పుకారులు-సమాధానాలు

 

ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచి, మనుషుల క్యాతిని పెంచిన ఈ అపోలో 11కి కూడా

ప్రశ్నలు తప్పలేదు.

1.జెండా ఎలా ఎగిరింది

బజ్ ఆల్డ్రిన్ చంద్రునిపై గర్వంగా రెపరెపలాడుతున్న జెండాకు సెల్యూట్ చేస్తున్నాడు. కానీ గాలిలేని చంద్రునిపై జెండా ఎలా ఎగురుతుంది. సరిగ్గా పరిశీలిస్తే దీనికి సమాధానం మనకే తెలుస్తుంది. ఫోటోలో ఉన్న జెండాను ఒకసారి పరిశీలిస్తే ఎగువ అంచున జెండాను సగర్వంగా ఎగురవేయడానికి ఒక టెలిస్కోపిక్ పోల్ పైభాగంలో అమర్చాట. చంద్రునిపై గాలి ఉండదని తెలిసిన నాసా జెండా ఎగురుతున్నట్టు ఉండాలని భావించి ఈ విధంగా చేసిందట.

2.ఆకాశంలో తారలు ఎందుకు లేవు.

నిజంగా చంద్రుడిపై తీసిన చిత్రం అయితే ఆకాశమంతా నక్షత్రాలు ఎందుకు లేవు ఈ ప్రశ్నతోనూ అపోలో 11ను భూటకమని కొందరు చెప్పుకొస్తారు. అక్కడ నక్షత్రాలు లేకపోవడానికి కారణం లేకపోలేదట. అది నిజానికి చంద్రునిపై పగటిపూట కావడం వల్లనే అక్కడ తీసిన ఫోటోలో నక్షత్రాలు కనిపించలేదట.

3.1969 అపోలో11 తరువాత మళ్ళీ చంద్రునిపైకి ఎందుకు వెళ్ళలేదు

1970లో చంద్రునిపై వ్యోమగాములు పంపడానికి జరిగిన చివరి మిషన్ అపోలో 17,మరి అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులు మళ్ళీ చంద్రునిపైకి ఎందుకు అడుగు పెట్టలేదు.దీనికి చాలా సమాధానాలే ఉన్నాయి. మొదటిగా అమెరికాకు మరియు వియత్నంకు మధ్య 1976లో జరిగిన యుద్ధం.అలాగే రష్యాను కోల్డ్ వార్లో ఓడించి అన్నీ సాధించేసామనే భావన. అన్నిటికీ మించి 2000 నుండి వ్యోమగాముల బృందాలు శాశ్వతంగా నివసించే స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ మరియు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు దృష్టి సారించారు.

What do you think?

డైనోసార్స్ పతనానికి కారణం ఇదేనా….?!

నీ నవ్వే చాలు … చామంతి పూబంతి