in

టాక్స్ డిపార్ట్మెంట్ కు 9.25 కోట్ల లాటరీ!

టాక్స్ డిపార్ట్మెంట్ కు 9.25 కోట్ల లాటరీ!

అదృష్టం ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరికీ తెలీదు. అదే అదృష్టం లాటరీ టికెట్ గెలవడంలో కలిగిందంటే అది అధ్బుతం అనే చెప్పాలి. ఇటీవలే ఇలాంటి అద్భుతమే కేరళలో జరిగింది.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన కే.అనూప్ అనే ఆటో డ్రైవర్ కి 25 కోట్ల లాటరీ తగిలింది. ఆ లాటరీ గెల్చుకునే వారానికి ముందు తన దగ్గర డబ్బులు లేవని,ఏం చేయాలో తెలియని పరిస్థితులలో లాటరీ తగులుతుందేమో అనే చిన్న ఆశతో తన కూతురు డిబ్బీని పగల కొట్టి దాంట్లో ఉన్న ఐదు వందల రూపాయలతో ఆ లాటరీ కొన్నానని అనూప్ వివరించాడు. అయితే అంత పెద్ద మొత్తం ఒకేసారి గెల్చుకోడంతో అనూప్ లాటరీ గెల్చుకున్న విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికీ వరకు ఎన్నో కష్టాలు పడిన ఆటో డ్రైవర్ అనూప్ జీవితం మారబోతోందని కొంతమంది ఆనందంతో అభినందనలు చెబుతుండగా, ఒక వ్యక్తి 9.25 కోట్ల గెలుచుకున్న టాక్స్ డిపార్ట్మెంట్కు అభినందనలు అంటూ వ్యంగ్యంగా తన అభిప్రాయాన్ని తెలియచేశాడు.

ఎవరైనా లాటరీ గెలుచుకున్నా లేదా ఏవిధమైన గేమ్ షోలో డబ్బు గెలుచుకున్నా, ఆ విజేతకు అందే మొత్తంలో నుంచి కొంత శాతం టాక్స్ డిపార్ట్మెంట్కు చేరుతుంది. ఆ విధంగా 15.75 కోట్లు అనూప్ కి, 9.25 కోట్లు టాక్స్ డిపార్ట్మెట్ కి చేరుతుంది.

ఇందు మూలంగానే సోషల్ మీడియాలో “ఏవిధమైన కష్టం పడకుండానే డబ్బు గెలుచుకున్న టాక్స్ డిపార్ట్మెంట్కు అభినందనలు” అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇప్పటి వరకు కష్టపడుతూ జీవించిన ఆటో డ్రైవర్ అనూప్ జీవితం మారబోతోంది. ఇకపై తను ఆశపడిన జీవితం జీవిస్తాడని కోరుకుందాం.

What do you think?

జోన్ రిస్చ్ ను అపహరించారా, అంతం చేశారా…?

ఎలోన్ టెస్లాను ఇండియా తీసుకురావట్లేదెందుకు?