in

ఎలోన్ టెస్లాను ఇండియా తీసుకురావట్లేదెందుకు?

ప్రపంచ కుబేరుడు,ట్విట్టర్,టెస్లా మరియు స్పేస్-ఎక్స్ కంపెనీల అధిపతి ఎలోన్ మస్క్ ఇండియాలో టెస్లా తయారీ కంపనీ ప్రారంభించడానికి ఎన్నోసార్లు ఆసక్తి కనపరిచారు. ఎలోన్ మస్క్ 2018లో టెస్లా యొక్క మొదటి విదేశ తయారీ సంస్థ గిగాఫ్యాక్టరీ-3ని షాంఘై,చైనాలో ప్రారంభించారు.

2021 నాటికి ఈ ఫ్యాక్టరీ దాదాపుగా సంవత్సరానికి 5,00,000 కార్లు తయారు చేయగా, ఒకే సమయానికి 4,50,000 మోడల్ 3 సేదన్స్ మరియు మోడల్ Y క్రాస్ఓవర్ తయారు చేయగల స్థాయికి చేరింది.

టెస్లా తయారీ సంస్థను ఇండియాలో ప్రారంభించమని కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా టెస్లాను ఇండియాలో ప్రారంభించమని ట్విట్టర్ ద్వారా ఎలొన్ మస్క్ ను ఆహ్వానించారు. పంజాబ్,వెస్ట్ బెంగాల్,మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా ఇండియాలో టెస్లాని ప్రారంభించడానికి వారి అంగీకారాన్ని తెలిపారు.

ఇండియాలో అంగీకారాన్ని చూసిన ఎలొన్ మస్క్ 10 శాతం అదనపు చార్జీలు తగ్గించమని,దిగుమతిలో చార్జీలను కూడా తగ్గించమని కోరారు. అందుకు సమాధానంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇండియాలో సంస్థను ప్రారంభించాలంటే చైనా నుంచి దిగుమతి చేసుకోకూడదని, టాక్స్ లో తగ్గింపు కావాలంటే ముందుగా ఇండియాలో తయారు చేయడం మొదలు పెట్టాలని చెప్పారు.

విషయం ఎటూ తేలకపోవడంతో ఎలొన్ మస్క్ ఇండోనేసియాలో టెస్లాను ప్రారంభించాలని నిర్ణయించుకుని ఇండోనేసియా ప్రెసిడెంట్ జోకో విడోడోని కలిసి చర్చించారు. ఏదేమైనా ఇప్పట్లో టెస్లా ఇండియాలో వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఒక వేళ టెస్లా ఇండియాలో ప్రారంభమైతే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు,దేశానికి ఆదాయమే కాకుండా అద్భుతమైన ఆటో పైలెట్ టెక్నాలజీ ఇండియాకు వస్తుంది.

What do you think?

టాక్స్ డిపార్ట్మెంట్ కు 9.25 కోట్ల లాటరీ!

డైనోసార్స్ పతనానికి కారణం ఇదేనా….?!