in

వందేభారత్ను వేగంగా విస్తరిస్తున్న ఇండియన్ రైల్వే.

ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ను సిద్దం చేస్తుంది.వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను చాలా వేగంగా విస్తరిస్తోంది.

దీనిలో భాగంగా సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం మధ్య 8వ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సౌత్ సెంట్రల్ రైల్వే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే సికింద్రాబాద్ నుండి మరో వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏప్రిల్ 8న ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఈ రైలు సికింద్రాబాద్ నుండి మిర్యాలగూడ- బీబీ నగర్- నడికుడి- గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. అయితే బీబీ నగర్-నడికుడి మార్గం మీదుగా వెళితే ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ట్రైన్ వరంగల్ మీదుగా రాకుండా వయా మిర్యాలగూడ సర్వీస్ ప్రారంభించనుంది. అయితే ఈ రైల్వే ట్రాక్ ను 130 కిలో మీటర్ వేగంతో ప్రయాణించేలా రైల్వే అధికారులు అప్ గ్రేడ్ కూడా చేశారు.
ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతోది. అదే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 140-150 కి.మీ. వేగంతో కేవలం ఆరున్నర గంటల్లోనే తిరుపతికి చేరుకుంటుందట.

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు టికెట్‌ రేటు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జీఎస్టీ, తత్కాల్ సర్‌చార్జీతో కలిపి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1150 నుంచి ప్రారంభం కానుందని ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ టికెట్ ధర రూ.2వేలు దాటవచ్చని సమాచారం.

What do you think?

విజయవాడ లో 12.97కిలోల బంగారం స్వాధీనం!

“ఆర్జీవీ పై చర్యలు తీసుకోవాలి” – వర్ల రామయ్య.