in

కూతురి మృత దేహం బండి మీద. కరుణించని అధికారులు..

కూతురి మృత దేహం బండి మీద. కరుణించని అధికారులు..

 

మధ్య ప్రదేశ్ లో హృదయ విదారకమైన ఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంబులెన్స్ ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి తన కూతురు మృత దేహాన్ని బండి మీద తీసుకు వెళ్ళాడు.

వివరాల్లోకి వెళ్తే షాహ్డోల్ జిల్లాలోని కోటా గ్రామంలో లక్ష్మణ్ సింగ్ నివసిస్తుంటారు. ఆయన 13 ఏళ్ల కూతురు సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధికి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి షాహ్డోల్‍లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది. తన కూతురు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కల్పించాలని ఆ ఆసుపత్రి అధికారులను ఆయన కోరారు.

అయితే షాహ్డోల్ నుంచి కోటా గ్రామానికి సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకే మాత్రమే వాహనాన్ని ఇస్తామని అక్కడి అధికారులు తేల్చిచెప్పారు. మృతదేహాన్ని తీసుకు వెళ్ళడానికి సొంతంగా వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్మణ్ సింగ్ కు సూచించారు. ఆయన వాళ్ళని ఎంత వేడుకున్నా ఆసుపత్రి అధికారులు ఆంబులెన్స్ ఇవ్వడానికి ఒప్పు కోలేదు. దీంతో సొంతంగా వాహనాన్ని ఏర్పాటు చేసుకునేంత డబ్బు లేని లక్ష్మణ్ సింగ్ తన కూతురు మృత దేహాన్ని తన బండి మీద తీసుకు వెళ్ళాడు.

 

లక్ష్మణ్ సింగ్ తన గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. షాహ్డోల్ కలెక్టర్ వందన వైద్య వారిని ఆపి, అక్కడి నుంచి వాళ్లు వెళ్లేందుకు వేరే వాహనం ఏర్పాటు చేశారు.
అలా కలెక్టర్ వందన వైద్య సహాయంతో లక్ష్మణ్ సింగ్ తన కూతురు మృతదేహాన్ని సొంత గ్రామం చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు.

What do you think?

కొడాలి నాని పై సునిల్ దేవ్ సంచలన వ్యాక్యలు..

పిల్లలు కావాలి, నా భర్తకు పెరోల్ ఇవ్వండి – ఓ మహిళ