in ,

రియల్ లైఫ్ ‘ఐరన్ మాన్ ‘ – ఎలాన్ మస్క్

రియల్ లైఫ్ ‘ఐరన్ మాన్ ‘ – ఎలాన్ మస్క్

స్పేస్ ఎక్స్ అధినేత. టెస్లా సి ఈ ఓ ఎలాన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. ఆయన షేర్ చేసే పోస్ట్ లనుండి వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల వరకు ప్రతిదీ వైరల్ గ మారి వార్తల్లో నిలుస్తుంది. చివరికి మస్క్ టీనేజ్ ఫోటోలను వేలం వేయగా వాటికోసం జనాలు ఎగబడి మరీ లక్షలు పోసి కొన్నారు.

ఒక మనిషి జీవితంలో ఎన్ని మలుపులు సాధ్యమో, అన్నీ తన ప్రయాణంలో కనిపిస్తాయి. ఆ మలుపుల్లో చాలావరకూ స్వయంకృషితో సొంతం చేసుకున్నవే.
ప్రతి ఎచీవ్మెంట్ నుండి ముందుకు సాగే గుణం. అదే గుణం ప్రపంచానికి ఎన్నో కొత్త కొత్త ఐడియా లను పరిచయం చేసింది. సోలార్ సిటీ కంపెనీ ద్వారా ప్రజలకు సోలార్ ఎనర్జీ ని దగ్గర చేసారు. తన టెస్లా మోటార్స్ ద్వారా ఎలక్ట్రిక్ కార్ అన్న కలను నిజం చేసారు. ఈ సక్సెస్ సరిపోకుంటే స్పేస్ ఎక్స్ ఒకటి చాలు ఎలాన్ మస్క్ సక్సెస్ తో దూసుకెళ్తున్నారు అని చెప్పటానికి,చాలామంది, లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు. అతికొద్దిమంది మాత్రం లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలాన్ మస్క్ అలాంటి ఓ అరుదైన వ్యక్తి.

సాంకేతిక లోకాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్త, ఇతర గ్రహాల మీదికి దూకుతున్న ఔత్సాహికుడు… నిజానికి ఈ పరిచయాలేవీ అంతగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. వాటిని తను సాధించిన తీరే అద్భుతం. ఆచితూచి మాట్లాడే నైజం లేదు. దూకుడుగా వేసిన అడుగు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందేమో అన్న భయం లేదు. తన గురించి ఎవరు ఏమనుకుంటారో అన్న చింతా లేదు. ఎత్తుపల్లాల జీవితం, ఒకదానివెంట ఒకటిగా తరుముకొచ్చే వైఫల్యాలు, సమస్యలను ధిక్కరిస్తూ, సవాళ్లకు తొడగొడుతూ, సంక్షోభాలను రెచ్చగొడుతూ, ప్రతిభ, అంకితభావంతో ఎలాన్ రీవ్ మస్క్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా మరియు సాంకేతిక వ్యవస్థాపకుడుగా ఎదిగారు.
నిజ జీవిత ఐరన్ మ్యాన్ అని పిలువబడే ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచారు. ఎన్నో కష్టాలనుంచి తను ఇప్పుడున్న స్థానానికి ఎలాన్ మస్క్ సాగించిన సాహస యాత్రే ఈ కథనం.

ఎలాన్ మస్క్ 1971 లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో లో జన్మించాడు. తల్లి మేయ్ మస్క్. కెనడా మూలాలున్న మోడల్. ఎలాన్ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన తర్వాత కూడా… అదీ తన 70వ ఏట వరకూ మోడలింగ్ చేస్తూనే ఉన్నారామె. తండ్రి ఎరోల్ మస్క్. ఇంజినీరింగ్ నుంచి మెరైన్ ఇంజినీరింగ్ వరకూ చాలా పనులే చేశాడు. అన్నిటికీ మించి తనకు ఓ పచ్చల గని ఉండేది. దీంతో తవ్వినకొద్దీ డబ్బే. బీరువాల్లో పట్టనంత కరెన్సీ. కాబట్టే, ఆ కుటుంబం విలాసంగా బతికేది.

ఎలాన్ మస్క్ తన బాల్యం అంత ప్రశాంత మైనది కాదు. చిన్న తనం లోనే మస్క్ తనకు తానుగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. దానివలన 12 ఏళ్ళ వయసులోనే తాను క్రియేట్ చేసిన ‘ బ్లాస్టర్ ‘ అనే గేమ్ ను 500 డాలర్ ల కు అమ్మాడు. 17 ఏళ్ళ వయసులోనే 1995 లో మస్క్ తన సోదరుడు కింబల్ తో కలసి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ని స్టార్ట్ చేసాడు. దాని పేరే ‘ జిప్ 2’. దానిమీద 28 వేల డాలర్ లు పెట్టుబడి పెట్టాడు. ఇంటర్నెట్ డెవలప్ అవుతున్న టైం, మస్క్ కంపెనీ న్యూస్ పేపర్స్ కోసం ఆన్లైన్ సిటీ గైడ్ ను స్టార్ట్ చేసాడు. జిప్ 2 అతి తక్కువ సమయం లోనే ‘ ది న్యూయార్క్ టైమ్స్’, ‘చికాగో ట్రిబ్యూట్’ అన్న రెండు మేజర్ న్యూస్ పేపర్స్ తో కాంట్రాక్టు ను చేసుకుంది.

అంతా బాగానే ఉన్నా కూడా జిప్ 2 లో కొన్ని టెన్సన్స్ మొదలయ్యాయి. బోర్డు ఈ కంపెనీ ని కంపాక్ కి 341 మిలియన్ డాలర్స్ కి అమ్మేసింది. అందులో మస్క్ షేర్ 20 మిలియన్ డాలర్స్. అదే సంవత్సరం 10 మిలియన్ డాలర్స్ ను పెట్టుబడి పెట్టి ఎక్స్ డాట్ కామ్ ‘ ను స్టార్ట్ చేసాడు. మస్క్. 2001 లో ‘ ఎక్స్ డాట్ కామ్ ‘ పేరును ‘ పే పాల్ ‘ గ మార్చేశాడు. అది కొన్ని రోజులకే ‘ ఆన్లైన్ పెమెంట్స్ సిస్టం అఫ్ ఛాయస్ ‘ గ మారింది. కొన్ని నెలలలోనే మిలియన్ కు పైగా యూజర్స్ ను సొంతం చేసుకుంది. కానీ బోర్డు మస్క్ ను కంపెనీ నుండి బయటకు వెళ్లేలా చేసింది.

పే పాల్ షేర్ క్లోజ్ అయినప్పటికీ, మస్క్ కన్ను మార్స్ మీద పడింది. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ లోని వర్టికల్ ఇంటెగ్రేషన్, మాడ్యులర్ అప్రోచ్ ను యూజ్ చేసి రాకెట్స్ ను బిల్డ్ చేయాలి అనే ఆలోచన మస్క్ కి వచ్చింది.

2002 లో ఆ ఐడియా నుండి పుట్టిందే ‘ స్పేస్ ఎక్స్’: మనుషులను వేరే గ్రహాలకు తీసుకెళ్లే అద్భుతమైన ఆలోచన. తన కల కోసం దాదాపు వంద మిలియన్ ల ను పెట్టుబడిగా పెట్టాడు. తర్వాత ఈ కంపెనీ నుండి కూడా ఫండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. 2006 ఫాల్కన్ 9 లాంచ్ కోసం నాసా, స్పేస్ ఎక్స్ కి 1.6 బిలియన్ డాలర్స్ ముట్ట చెప్పింది.

మస్క్ తనను ఫేమ్ లోకి తీసుకు రాగలిగే బ్రాండ్ ను స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. అదే ‘ టెస్లా మోటార్స్ ‘. ఈ కంపెనీకి లీడింగ్ ఇన్వెస్టర్ గ మారాడు. దీనికోసం 7.5 మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసాడు. ఈ కంపెనీ ని పైకి తీసుకు రావటానికి 2008 లో టెస్లా కు సి ఈ ఓ గ బాధ్యతలను తీసుకున్నాడు. ఈ కంపెనీ తయారు చేసిన మొదటి కార్ టెస్లా రోడ్ స్టర్’ 31 దేశాలలో 2500 కార్స్ అమ్ముడు పోయాయి. ఈ ఎనర్జీ ఈక్వేషన్ కోసం సోలార్ సిటీ అనే ఐడియా తో వచ్చాడు మస్క్. ఈ కంపెనీ ని 2006 లో మస్క్ కజిన్స్ స్టార్ట్ చేసారు. ఈ కంపెనీ సోలార్ పానెల్స్ ను సొంతం గ డిజైన్ చేసి, ఇన్స్టాల్ చేస్తుంది.

టెస్లా మోటార్స్ కొలాబరేషన్ తో ఎలెక్ట్రికల్ కార్ స్టేషన్స్ ను కూడా సొంతం గ కనస్ట్రక్ట్ చేసారు. ఇప్పటికే ఈ కంపెనీ యు ఎస్ లోని సెకండ్ లార్జెస్ట్ పవర్ సిస్టం.
టెస్లాతో నేల మీద విజయం సాధించాడు. స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. ఇక పాతాళం మీద దృష్టి పడింది.2013 లో మస్క్ ఒక హైపోథెటికల్ మెషిన్ ప్రొపోజల్ ను తీసుకొచ్చాడు. లాస్ ఏంజెల్స్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు ప్యాసెంజర్స్ ను కేవలం 35 నిమిషాలలో తీసుకెళ్లగలిగేమెషిన్ తయారు చేయనున్నాడట. దీనికి ‘ హైపర్ లూప్ ‘ అని పేరు పెట్టుకున్నాడు మస్క్. దీనికోసం 6 బిలియన్ డాలర్స్ ఖర్చు చేయనున్నాడట.

ఒక కంప్యూటర్ చిప్ మన మెదడులో జరిగేవన్నీ రికార్డు చేసి, అవసరం అయినప్పుడు ఒక బ్యాకప్లో ఉపయోగపడితే! చూపులేనివారికి, పక్షవాతం లాంటి సమస్యలు ఉన్నవారికి మెదడులో కొన్ని పరికరాలను అమర్చి కొత్త జీవితం ఇవ్వగలిగితే! చదవాలనుకున్న విషయాన్ని నేరుగా మెదడులోకి ఎక్కించగలిగితే!… ఇలాంటి లక్ష్యాలతో ఏర్పాటైంది న్యూరాలింక్. న్యూరాలింక్తో పాటుగా సౌర విద్యుత్ కోసం ‘టెస్లా ఎనర్జీ’, రవాణా కోసం ‘హైపర్ లూప్ ప్రాజెక్ట్’… ఇలా చాలా లక్ష్యాలే ఉన్నాయి తనకి. వాటివైపుగా వేగంగా అడుగులు వేస్తున్నాడు కూడా.

బిలియనీర్ అవ్వటానికి ఎలాన్ మస్క్ చేసిన తన కెరీర్ లో మస్క్ ఎన్నో అటు పోట్లను ఎదుర్కొన్నాడు. ఎలాన్ మస్క్ తన ఇన్నోవేటివ్ ఐడియాస్ ను నిజం చేసుకున్నాడు. ఓటమిల నుండి కష్టాలనుండి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. తనమీద తనకున్న నమ్మకం తో ప్రతి విషయం లోను రిస్క్ తీసుకుంటూ ముందుకు సాగాడు. కొన్ని సంవత్సరాలు కష్టంగా, నష్టం గ మారినా కూడా సక్సెస్ తన వద్దకు వస్తుందని నమ్మి అడుగు ముందుకు వేసాడు విజయం సాధించాడు.

ఎలాన్ మస్క్ కు భారత్తో అంత సత్సంబంధాలు లేవు. దేశంలో ఇంటర్నెట్కు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే, స్టార్ంక్ సేవలు అందిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడనే అభియోగం ఉంది. ఇక టెస్లా బ్యాటరీ కార్ల మీద పన్నులు తగ్గించాలంటూ ఎలాన్ మస్క్ చేసిన అభ్యర్థనను మోదీ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది..

సౌత్ చైనా ‘మార్నింగ్ పోస్ట్ ప్రకారం… చైనా వ్యాపారులకు ఎలాన్ మస్క్ అంటే విపరీతమైన అభిమానం. రెస్టారెంట్ల దగ్గర నుంచి బట్టల వరకూ ఎన్నో వ్యాపారాలు ఎలాన్ మస్క్ పేరుతో నడుస్తున్నాయి. ఇక ఎలాన్ మస్క్ కు కూడా షాంఘైలో టెస్లా కార్లను తయారుచేసే ఫ్యాక్టరీ ఉంది.’ద స్పై హూ లవ్డ్ మీ’ అనే జేమ్స్ బాండ్ సినిమాలో జలాంతర్గామిగా మారిపోయే ఓ కారు కనిపిస్తుంది. ఆ కారును ఓ జంట వంద డాలర్లకు కొన్నది. కొన్నాళ్లకు ఎలాన్ మస్క్, దాదాపు మిలియన్ డాలర్లు పెట్టి దాన్ని వేలంలో సొంతం చేసుకున్నాడు. ఆ నమూనా ఆధారంగా ‘ సైబర్క్ ‘ అనే వాహనాన్ని రూపొందించాడు.

ఎలాన్ మస్క్ రెండుసార్లు పెండ్లి చేసుకున్నాడు. ఇద్దరితోనూ విడాకులయ్యాయి. ఆ తర్వాత శాశ్వతమైన బంధంలో ఇమడలేదు.

‘ఐరన్ మ్యాన్’లో కథానాయకుడి పేరు టోనీ స్టార్క్. ఈ పాత్రను సినిమాగా మలిచేందుకు ఎలాన్ మస్క్ ను ప్రేరణగా తీసుకున్నారు.

మొదట్లో ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి. సంచలనానికి తెర లేపిన మస్క్. కొన్ని కారణాల వలన ఆ డీల్ నుండి తప్పుకున్నాడు. మస్క్ ఈ మధ్య ‘ట్విట్టర్ నన్ను అణచి వేస్తుంది కాపాడండి ‘ అని వెరైటీ ట్వీట్ చేసే అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు.

ఎలాన్ మస్క్ మాత్రం ఎప్పుడూ ఊహలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఎలాన్ ఎప్పుడూ భయపడింది లేదు. వింతగా ఆలోచించే శాస్త్రవేత్త, నిర్భయంగా ప్రవర్తించే వ్యాపారవేత్త… ఇద్దరూ ఒకరిలోనే ఉంటే… అదే ఎలాన్ మస్క్ విజయం సాధించాలి అనుకునే వాళ్ళందరికి కూడా మంచి స్పూర్తి ఈ ‘ రియల్ లైఫ్ ఐరన్ మాన్ ‘ .

What do you think?

గ్లోబల్ వార్మింగ్ కాదు …గ్లోబ్ వార్నింగ్

భూతలస్వర్గం లో వెండితెర వెలుగులు…