in

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు. రూ. 1.3 కోట్ల…

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

కొకైన్ సరఫరా చేస్తున్న కొందరు వ్యక్తులను హైదరబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 6 ఫోన్లను, 1.3 కోట్లు విలువ చేసే 303 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్, ఫిల్మ్ నగర్ కి చెందిన చింతా రాకేష్ అనే వ్యక్తి డ్రై ఫ్రూట్స్ ను విక్రయిస్తుండే వాడు. అయితే ఆ వ్యాపారంలో నష్టం రావడంతో వత్తిడికి గురై మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. గోవా వెళ్ళి అక్కడ నైజీరియాకు చెందిన గాబ్రియేల్ అనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తరువాత నెమ్మదిగా తను కూడా మాదక ద్రవ్యాల వ్యాపారంలోకి దిగాడు. గోవా నుండి 7 వేల రూపాయల కొకైన్ కొనుగోలు చేసి, దాన్ని హైదరాబాద్ లో 18 వేల రూపాయలకు అమ్మడం ప్రారంభించాడు. అలా బోల్డంత లాభాలను పొందాడు.

కొన్నేళ్లుగా కొకైన్ సరఫరా చేస్తున్నా.. పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. తన లాగే వ్యాపారంలో దెబ్బ తిన్న శ్రీనివాస్ రెడ్డి, సూర్య ప్రకాష్లను కూడా ఈ వ్యాపారంలోకి దింపి మాదక ద్రవ్యాల సరఫరాలో తన కింద ఏజెంట్లుగా మార్చుకున్నాడు. గోవా నుండి కొకైన్ను హైదరాబాద్ కు తీసుకురావడానికి వారిని పంపడం మొదలు పెట్టాడు.

అయితే ఇది ఇలా ఉండగా, గాబ్రియేల్ తన భార్య గర్భవతి కావడంతో విక్టర్ అనే వ్యక్తికి గోవాలో వ్యాపారాన్ని అప్పగించి నైజీరియా వెళ్ళాడు. ఆ తరువాత విక్టర్ కొకైన్ సరఫరా చేయడానికి హైదరాబాద్ వచ్చాడు. ఈ సమయంలోనే హైదరాబాద్ పోలీసులు నిఘా వేసి విక్టర్ తో పాటు రాకేష్, తన ఏజెంట్లు శ్రీనివాస్ రెడ్డి, సూర్య ప్రకాష్లను అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 6 ఫోన్లను, 1.3 కోట్ల రూపాయలు విలువ చేసే కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వారి వాట్స్ యాప్ మెసేజ్లను ముందు నుంచి డిలీట్ చేయడంతో ఆ సమాచారాన్ని తెలుసుకోడానికి ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, గాబ్రియేల్ ప్రస్తుంతం పరారీలో ఉన్నాడని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

What do you think?

జాతి వివక్ష ముగిసేదెప్పుడు?పరాయి భావం మారేదెప్పుడు

బీసీసీఐకి విరాట్ లేఖ. “తప్పు నాది కాదు.”