in

తలదాచుకున్న వలస పక్షులు నేలరాలాయి…..

వలస పక్షులు నేలరాలాయి..

జాతీయ రహదారి విస్తీర్ణంలో వలస పక్షులు నేల రాలిపోయాయి.కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన రండతాని ప్రాంతంలో జాతీయ రహదారి విస్తీర్ణంలో బాగంగా రవాణా శాఖ వారు చెట్లను కొడుతున్నారు. అలా చెట్లు కొట్టే సమయంలో చెట్లపై ఉన్న పక్షులు కొన్ని తప్పించుకోగా,ఇంకొన్ని పక్షులు,వాటి గుడ్లు కిందపడి అక్కడికక్కడే చనిపోయాయి. వర్షాకాలం కావడం వల్ల కొంగలు, కార్మంట్ పక్షులు వలస వెళ్తూ చెట్లలో తల దాచుకుని, అక్కడే గూడు కట్టుకుని
నివసిస్తుంటాయి.

వాటిని గమనించకుండా చెట్లను నరికేయడం వల్ల చాలా వరకు పక్షులు కింద పడి చనిపోతున్నాయి. అందువల్ల పర్యావరణ వేత్తలు వర్షా కాలం వెల్లేంత వరకు చెట్లను కొట్టడం ఆపమని రవాణా శాక వారిని కోరారు. రోజు రోజుకు మనషులు చేసే కాలుష్యం వల్ల,మొబైల్ ఫోన్ల సిగ్నల్ రేడియేషన్ వల్ల పక్షులు అంతరించిపోతున్న ఈ తరుణంలో ఇటువంటి ఘటనలకు మనుషులు పూనుకోవడం అంగీకరించలేనిది.

రోడ్ల అభివృద్ధి కోసం రవాణా శాక వారు చెట్లను నరికేటప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఆ ప్రాంతంలో ఉండే చెట్లన్నీటిని కూలంకుషంగా పరిశీలించాలి. చెట్ల తొరలను,కొమ్మలను సంపూర్ణంగా పరీక్షించి వాటిపై పక్షులు లేవని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే చెట్లను నరికే యోచన చేయాలి.అలా చేస్తేనే పక్షులను కాపాడుకోగలం. పక్షులు మనుషులకు,పర్యావరణానికి ఎంతో సహాయపడతాయి.పరాగసంపర్కంలోను,విత్తనాలను వేరే ప్రదేశంలో నాటడంలోను ఎంతో సహాయపడుతున్నాయి.

జంతువులు తిని వదిలేసిన మాంస వ్యర్ధాలను తిని పరియావరనానికి ఎంతో మేలు చేస్తున్నాయి.పక్షుల అంతానికి కారణమైతే అది భూమి అంతానికి కారణమౌతుంది. కాబట్టి వాటిని రక్షించుకోవడం మనుషుల కనీస బాధ్యత.

 

What do you think?

అతనొక ఛాయ్ వాలా.అయితేనేం బ్యాంకుతో పోరాడి గెలిచాడు

స్టోన్ హెంజ్ రహస్యం వీడినట్టేనా…?