in ,

స్టోన్ హెంజ్ రహస్యం వీడినట్టేనా…?

స్టోన్ హెంజ్ రహస్యం

ఈ భూమి పై మనుషులకు తెలియని వింతలు,విచిత్రాలు ఎన్నో. వాటిలో పెరూ లోని మాచు పీచు, టర్కీ లోని గోబెక్లి టేప్, ఈజిప్ట్ లోని పిరమిడ్ లాంటి కట్టడాలు అంతుచిక్కని రహస్యాలతో చేదింపబడటానికి వేచి చూస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఇంగ్లాండుకి చెందిన విల్ట్ షైర్ లోని స్టోన్ హెంజ్. అయితే ఇప్పుడు దీని రహస్యం వీడిందనే అంటున్నారు.

స్టోన్ హెంజ్ ను 3,000 బీసీ నుంచి 2,500 బీసీ వరకు ఇంగ్లాండ్ కి చెందిన అంసెబురీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్ట్ షైర్ లో నిర్మించారు. ఈ ఒకొక్క రాయి 13 అడుగులు పొడవు,7 అడుగుల వెడల్పు,25 టన్నుల బరువు కలవని, ఇవి అక్కడికక్కడ నిర్మించినవి కావని వేరే ప్రదేశం నుంచి తెచ్చి అక్కడ నిలబెట్టారని మునుపే పరిశోధకులు వెల్లడించారు.దీని నిర్మాణానికి గల కారణాలు తెలుసుకోవటానికి పరిశోధకులు కొన్ని సిద్ధాంతాలను కూడా ప్రతిపాదించారు.

కొందరు ఇది రోమన్ల గుడి శిలాజాలు అని చెప్పగా మరికొందరు ఇది నియోలితిక్ శకానికి చెందిన స్మశానవాటికని, చనిపోయిన వారి స్మారక చిహ్నమని చెప్పారు.ఇలా ఎన్ని సిద్ధాంతాలున్నపటికీ తాజాగా దీని రహస్యాన్ని మరోసారి చేదుంచినట్టు పరిశోధకులు చెప్తున్నారు.

ఈ స్టోన్ హెంజ్ స్మారకం 365.25 రోజుల సోలార్ క్యాలెండర్ అని,దీనిని నెలల్ని,రోజుల్ని ,సమయాన్ని తెలియచేస్తూ,మనుషులకు సహాయపడటానికి నిర్మించారని పరిశోధకులు వెల్లడించారు.

ఒకవేళ ఈ విషయం నిజమైనప్పటికి వేల మంది కలిసి 10 సంవత్సరాలు కష్టపడినా చేయలేని పనిని క్రేన్లు, పెద్ద పెద్ద యంత్రాలు లేని సమయంలో ఈ రాళ్ళను అక్కడికి తెచ్చి ఎలా పెట్టారన్న విషయం రహస్యం గానే మిగిలిపోతుంది

What do you think?

తలదాచుకున్న వలస పక్షులు నేలరాలాయి…..

మేరీ సెలేస్టే….. పడవా..? పిశాచ..?