in ,

వీడిన ఛాయ సోమేశ్వరాలయం మిస్టరీ….

వీడిన మిస్టరీ – ఛాయ సోమేశ్వరాలయం

(Untold story of Jalalingam Temple)

“ఈ గుళ్లోని శివలింగం పై ఎప్పటికి కదలకుండా ఒకే స్థానం లో ఉన్నట్లు గ ఒక చాయ కనిపిస్తుంది. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంత సేపు నీడ కదలకుండా ఒకే స్థానం లో ఉంటుంది. సూర్యుని గమనం లో మార్పు సైతం ఆ నీడ ను మార్చదు.
ఆ నీడ ఎందుకు పడుతుంది? ఆ నీడ ఆ స్థానాన్ని ఎందుకు మార్చుకోదు?
అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని విషయం ”

పానగల్లు –

అది చరిత్రలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం. రాజులు నడయాడిన నేల,
రాజ్యానికి రాజధానిగా భాసిల్లిన పట్టణం. శిల్పకళ ఉట్టిపడే అపురూప కట్టడాలకు నెలవు. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందని అనుకుంటున్నారా.
నల్గొండ పట్టణానికి కూతవేటు దూరం లో ఉన్న ఈ ప్రాంతం రాజులూ రాజ్యాలు కనుమరుగైనా నేటికీ ఆ ప్రాంతం ప్రసిద్ధమే. చాళుక్యులు, చోళులు కుతుబ్ షాహీ వంశాల కాలం లో పానగల్లు ఒక మహా నగరం గ విలసిల్లింది. కందూరి చోళరాజైన ఉదయరాజు పానగల్లు ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడని చరిత్ర చెబుతుంది.

. క్రీ.శ. 1176 లో చోళుల అనంతరం కాకతీయ సామంత రాజులకు రాజధానిగా మారింది. రాజ్యాలు అంతరించినా అలనాటి రాజులు ఎంతో కళాపోషకులు అనేదానికి నిదర్శనం గ నిలుస్తున్నాయి పానగల్లు లో నిర్మించిన ఆలయాలు లోని శిల్పాలు. నాటి కళా నైపుణ్యం కళ్లకుకట్టే విధంగా చూపరులను కట్టి పడేస్తున్నాయి. నేటికీ చెక్కు చెదరకుండా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నాటి రాజుల సామ్రాజ్య వైభవాన్ని, చారిత్రక వికాసాన్ని చాటేందుకు ఎన్నో ఆలయాలను నిర్మించారు. అందులో ప్రధానమైనది ఛాయా సోమేశ్వరాలయమ్, పచ్చల సోమేశ్వరాలయం, పలనాటి నాగమ్మ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, త్రికూటేశ్వర ఆలయం తో పాటు, ఉదయ చోళరాజు పేరు మీద నిర్మించిన ఉదయ సముద్రం నేటికీ చెక్కు చెదరకుండా నేటి తరాన్ని అలరిస్తున్నాయి…

11, 12 శతాబ్దాల మధ్యకాలం లో చోళులు నిర్మించిన ఛాయాసోమేశ్వరాలయం ఎంతో ప్రత్యేకం గ నిలుస్తుంది. గర్భగుడిలో కాలం తో సంబంధం లేకుండా జలం ఊరుతూనే ఉంటుంది. దీన్ని జల లింగం అని కూడా అంటారు
ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత వుంది. ఈ గుళ్లోని శివలింగం పై, గోడ పై ఎప్పటికి కదలకుండా ఒకే స్థానం లో ఉన్నట్లు గే ఒక ఛాయ కనిపిస్తుంది. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంత సేపు నీడ కదలకుండా ఒకే స్థానం లో ఉంటుంది. సూర్యుని గమనం లో మార్పు సైతం ఆ నీడ ను మార్చదు. ఆ నీడ ఎందుకు పడుతుంది, ఆ నీడ ఆ స్థానాన్ని ఎందుకు మార్చుకోదు? అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతు చిక్కని విషయం..

ఎంతో మంది చరిత్ర కారులు అధ్యయన కారులు పరిశోధించినా ఆ మిస్టరీ ని ఛేదించలేక పోయారు. గ్రీన్ మిక్స్డ్ బ్లాక్ స్టోన్స్ తో నిర్మితమయిన స్తంభాలు తో గుడి కట్టబడింది. స్తంభాలు కుడ్యాల పై రామాయణ, మహాభారత ఇతి హాసాలను తెలియచేసేలా శిల్పాలు చెక్కబడి ఉన్నాయ్. ఆనాటి ప్రజల ఆచార వ్యవహారాలు తెలియచేసే విధం గ ఉన్నఛాయా సోమేశ్వరాలయం లో ప్రతి స్థంభం లో ఒక విశిష్టత గోచరిస్తుంది….

శతాబ్దాలుగా మిస్టరీ గ ఉన్న ఆలయ ఛాయా రహస్యాన్ని ఛేదించాడు ఒక ఫిజిక్స్ లెక్చరర్, కాంతి పరావర్తనం సిద్ధాంతం ఆధారం గా దీనిని నిర్మించారని ఈ మధ్య సూర్యాపేట కు చెందిన భౌతిక శాస్త్ర అధ్యాపకుడు ఈ విశ్లేషించాడు. చాల ఏళ్లుగా వీడని మిస్టరీ ని వెలుగు లోకి తెచ్చాడు..

ఈ ఆలయ నమూనా ధర్మకోల్ తో, కొవ్వొత్తులను స్తంభాలుగా చేసి ఈ ఆలయాన్ని రూపొందించాడు మనోహర్. చీకటి గదిలో టార్చి లైట్ ను సూర్యుని కాంతి గా ఉపయోగిస్తూ ఎన్నో ప్రయోగాలు చేసాడు. వందల ఏళ్లుగా గర్భగుడిలో దాగి ఉన్న ఆ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఈ ఛాయా సోమేశ్వరాలయాన్ని కాంతిని పరావర్తనం చెందించటం ద్వారా నిర్మించారట. అలాగే ఆ శివలింగం పై పడే నీడ కూడా ఒకే స్తంభానికి చెందినది కాదట. రెండు వైపులా నుండి వచ్చిన కాంతి ఆ స్తంభాల పై పడి పరావర్తనం చెంది గర్భ గుడిలోని శివలింగం పై ప్రతిబింబించేలా చేశారట కాకతీయుల కాలం నాటి శిల్పులు. ఆలయం లో ఛాయ వెనుక కీలకం అంతా స్తంభాల అమరికలోనే ఉందని మనోహర్ అభిప్రాయం పడ్డారు. ఆ కాలం లోనే భౌతిక శాస్త్రం ఆధారంగా కాంతి ని దారి మళ్లించి ఒక నీడను గర్భ గుడిలో పడేలా చేసారని, మనోహర్ నిరూపించాడు. మనోహర్ మాటల్లో….

గుడి నిర్మాణం సౌష్ఠవ నిర్మాణం లో ఉంది. నాలుగు దిక్కుల్లో నాలుగు గర్భగుడులు పథకం ప్రకారం నాలుగు గర్భ గుడులతో గుడి నమూనాను తయారుచేసి, దక్షిణాన ఉన్న గర్భగుడిని తొలగించి కేవలం పశ్చిమాన ఉండే గర్భగుడి లోనే నీడను పడేలా చేసారు. నీడ పడడానికి శిల్పి పరిక్షేపక సూర్య కాంతి ని వినియోగించాడు. పరీక్షేపణ సూర్య కాంతి అంటే కాంతి పరావర్తనం ) సూర్యుని కాంతి నేరుగా గుడి లోపలకు రాకుండా గాలి, వాతావరణం అంతా కూడా సూర్యుని కాంతి లోపలి పరిక్షేపణం కావించి ఈ నీడ పడేలా ఏర్పాటు చేసారు.

సూరీడు తూర్పున ఉదయించి పడమర వైపు కదులుతాడు. అందుకే పడమర వైపు ఉండే గుడిలో మాత్రమే నీడ పడేలా నిర్మాణ చతురత చూపించారు. నీడ పడే గుడి పక్కన కాంతి వచ్చే ప్రదేశం లో విగ్రహాలు పెట్టి అడ్డువేశారు. అందుకే తూర్పు గర్భగుడిలో నీడ పడదు. అలాగే ఉత్తరం వైపు గుడిలో పడకుండా దక్షిణం వైపు ఖాళీగా వదిలేసారు. అటువైపు కూడా నిర్మాణాలు ఉంటే ఉత్తరం గుడిలో కూడా నీడ పడేది. అలా ఈ మిస్టరీ వీడింది…

What do you think?

మహా నవలా రాజం – వీరగాథ– ‘పొన్నియిన్ సెల్వన్’

గ్లోబల్ వార్మింగ్ కాదు …గ్లోబ్ వార్నింగ్