in ,

దేశ ప్రధానిని కాపాడిన 14 ఏళ్ల హరీష్ మెహ్రా కథ

ప్రధానిని కాపాడిన 14 ఏళ్ల హరీష్

1957,అక్టోబర్ 2న న్యూఢిల్లీల్లో జరుగుతున్న రామలీలాను చూడటానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ రామలీల్ మైదానానికి విచ్చేశారు. అదే సమయంలో నెహ్రూ కూర్చున్న వీఐపీ పందిరి దగ్గర హరీష్ మెహ్రా అనే 14 ఏళ్ల కుర్రాడు స్కౌట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

అందరూ రామలీలను సంతోషంగా వీక్షిస్తున్నారు. అంతా బాగుందనుకునే సమయంలో ఒక్కసారిగా వీఐపీ షామియానాకు మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగడం గమనించిన అక్కడి వారు భయపడి పరుగులు తీయడం మొదలు పెట్టారు. అంతా గందరగోళం, ఎవరి ప్రాణం కోసం వాళ్ళు పరిగెడుతున్న సమయం అది. అలాంటి సమయంలో అక్కడ స్కౌటింగ్ చేస్తున్న 14 ఏళ్ల హరీష్ మెహ్రా మాత్రం వేగంగా నెహ్రూ దగ్గరకు వెళ్ళి ఆయనను క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు.

అంతటితో ఆగకుండా అతను తిరిగి నరకంలోకి పరిగెత్తాడు, 20 అడుగుల స్తంభం ఎక్కి తన స్కౌటింగ్ కత్తితో కాలిపోతున్న గుడ్డను కత్తిరించాడు. దీంతో అతని చేతులు తీవ్రంగా కాలిపోయాయి. ఎవరూ చేయడానికి ముందుకు రాని పనిని ధైర్యంగా చేసి హరీష్ అందరి ప్రాణాలను కాపాడాడు.

హరీష్ ధైర్యసాహసాలకు గాను 1958, ఫిబ్రవరి 3న జాతీయ గ్యాలంట్రీ అవార్డును ఇస్తూ నెహ్రూ 14 ఏళ్ల హరీష్ మెహ్రాను మెచ్చుకున్నారు. అవార్డును అందించటం కంటే ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అతని ధైర్యసాహసాలకు గాను ప్రధాని నెహ్రూ హరిష్ను అవార్డుతో సత్కించబోతున్నారనే శుభవార్తను అందించడానికి ఇందిరా గాంధీ స్వయంగా అతని పాఠశాలకు వెళ్ళారట. యుక్త వయసులోనే జాతీయ గ్యాలంట్రీ అవార్డును అందుకున్న మొట్టమొదటి వాడిగా హరీష్ చరిత్ర సృష్టించాడు. 77 ఏళ్లకు చేరుకున్న హరీష్ మెహ్రా ప్రస్తుతం ఢిల్లీలోని చాందినీ చౌక్లో నివసిస్తున్నారట.

What do you think?

ప్రసవం తరువాత బాలింతలు తిస్కోవాల్సిన జాగ్రత్తలు…

ఫ్లూటో అండ్ చంద్రుడు ఫర్ సేల్. మీకు కావాలా..?!