in

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్!

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్!

 

మాజీ మంత్రి భూమా అఖిలప్రియను సెక్షన్ 307 కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెను పాణ్యం పోలీస్ స్టేషన్కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేశ్ కు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ, తెదేపా నేత ఎ. వి. సుబ్బారెడ్డి కొత్తపల్లి గ్రామం దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

అయితే ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వర్గపోరు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అఖిలప్రియ వర్గీయుడు ఎ.వి. సుబ్బారెడ్డిని కొట్టడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంత సేపటికి పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

కాగా.. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు సెక్షన్ 307 కింద ఆళ్ల గడ్డలో అఖిలప్రియను అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఆమెను పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

What do you think?

అరుదైన ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన ఓ నైజీరియన్ మహిళ

కొడాలి నాని పై సునిల్ దేవ్ సంచలన వ్యాక్యలు..