in

పాకిస్థాన్ నుంచి భారత్కు అక్రమంగా వచ్చి 9 ఏళ్ళు కాపురం.

రాంగ్ కాల్లో కలిసి పెళ్ళాడి తొమ్మిదేళ్లు కాపురం చేసిన పాకిస్థాన్ పౌరుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెద్ద దిక్కులేక పిల్లలను పోషించడానికి కష్టపడుతున్న భార్య తన భర్తను విడిచిపెట్టమంటూ వేడుకుంటుంది.
వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా గడివేములకు చెందిన షేక్ దౌలత్బీకి పెళ్లయిన ఏడేళ్లకి భర్త చనిపోయాడు. అప్పటికే వారికి ఓ కొడుకు ఉన్నాడు. అలా భర్త చనిపోవడంతో దౌలత్బీ తల్లిదండ్రుల వద్దకు చేరింది.

ఐతే 2010లో దౌలత్బీకు ఫోన్కు ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఆ కాల్ తో పాకిస్థాన్ పౌరుడైన గుల్జార్ఖాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అక్కడి పంజాబ్ ప్రావిన్స్కు చెందిన గుల్జార్ సౌదీ అరేబియాలో పెయింటర్ గా పనిచేసేవాడు. రెండు వేరు దేశాల్లో ఉన్న వీరిద్దరు ఆ రాంగ్ కాల్ తరువాత నుంచి తరుచూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తరువాత వీరి బంధం బలపడడంతో దౌలత్బీను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు. దీనీకోసం గుల్జార్బన్ సౌదీ నుంచి ముంబయి మీదుగా భారత్లోకి అక్రమంగా ప్రవేశించాడు. నేరుగా గడివేములకు వచ్చి 2011 జనవరి 25న దౌలత్బీతో నిఖా చేసుకున్నాడు. వారికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. వీరి సంసారం తొమ్మిదేళ్ళ వరకు బాగానే జరిగింది. గుల్జార్బన్ ఇక్కడ పౌరుడిగా ఆధార్ కార్డ్ కూడా తీసుకున్నాడు.
ఆ ఆధార్ కార్డ్ ఆధారంగా తనతో పాటు భార్య, ఐదుగురు పిల్లలను సౌదీ అరేబియాకు తీసుకెళ్లేందుకు గుల్జార్బన్ వీసాలు తీసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లాలొచ్చని ఉద్దేశించారు. కానీ 2019లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్ళగా.. తనిఖీ సిబ్బంది పరిశీలనలో గుల్జార్బన్ అక్రమంగా భారత్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు.
గుల్జార్ ఖాన్ అరెస్టయిన ఆరు నెలల తర్వాత కరోనా కారణంగా జైలు నుంచి విడుదల చేశారు. దీంతో ఏడాది పాటు భార్య పిల్లలతో కలిసి ఉన్నాడు. అంతా కుదుట పడడంతో గత ఏడాది 2022లో గుల్జార్బన్ ను మళ్లీ హైదరాబాద్లోని జైలుకు తరలించారు.
ఐతే కూలీ పనులు చేసే వాళ్ళ పెద్ద కుమారుడు మహమ్మద్ ఇలియాస్ తప్ప మిగిలిన 4 పిల్లలు పదేళ్లలోపు చిన్నారులు కావడంతో దౌలత్బీ తన భర్తను వదలేయమని వేడుకుంటుంది.

What do you think?

మళ్ళీ రంగంలోకి దిగిన సమంత.మస్త్ కుష్ అవుతున్న ఫ్యాన్స్.

చనిపోయాడని ఖననం చేసిన వ్యక్తి విడియో కాల్ చేసాడు.