in ,

సి.వి రామన్ నోబెల్ ప్రైజ్ కి కారణమైన చిన్న ప్రశ్న

సి.వి రామన్ నోబెల్ ప్రైజ్ కి కారణమైన చిన్న ప్రశ్న

 

ఈ ప్రపంచంలో వింతలు ఎన్నున్నా వాటిని గమనించే తీరిక,వాటి పనితీరును ప్రశ్నించే ఓపికా మనుషులకు ఉండవు. కానీ ఒక వేళ అలా ప్రశ్నిస్తే ఆ వ్యక్తి ఆవిష్కరించే అద్భుతాలకు,గెలుచుకునే అవార్డులకు అవదులు కూడా ఉండవు. అలాంటి ఒక చిన్న ప్రశ్నే భౌతిక శాస్త్రవేత్త సి.వి రామన్ విలువైన నోబెల్ పురస్కారం గెలుచుకోవడానికి కారణమైంది.

1888లో తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన తిరువనైకోవిల్ గ్రామంలో జన్మించిన చెంద్రశేఖర వెంకట రామన్ చిన్నప్పటి నుంచి చదువులో మెరుగ్గా ఉంటూ భౌతిక శాస్త్రంలో ఎక్కువ అసక్తి కనపరిచేవారట.

ఆయన ఆపై తన కంటికి కనిపించిన దానినల్లా.. ప్రశ్నిస్తూ ఎల్లపుడూ వివిధ రకాల వాటి పై విశేషమైన పరిశోధనలు చేస్తుండేవారట. అలా ప్రశ్నించే స్వభావమే ఆయన విశేణమైన ఆవిష్కరణకు కారణమైంది.1921లో కలకత్తా విశ్వవిద్యాలయం తరపున ఇంగ్లాండ్ వెళ్లిన సి.వి.రామన్ తిరిగి కలకత్తాకు ప్రయాణించేటప్పుడు ఓడపై నుంచి సముద్ర జలాలను పరీక్షగా గమనించారు. అలా ఆయన చూసినప్పుడు సముద్రంలోని నీళ్లు నీలం – ఆకుపచ్చ రంగులో కనిపించడంతో ఆయన మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది. ఆ ప్రశ్న మూలంగా ఆయన పరిశోధన చేసి కనుగొన్నదే “రామన్ ఫలితం(ఎఫెక్ట్)”.

మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా పంపితే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగ ధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలి రంగు కాంతి బహిర్గతమవుతుంది.

దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. ఈ రామన్ ఫలితాన్ని(ఎఫెక్ట్) 1928లో సి.వి.రామన్, కె.ఎస్.క్రిష్ణన్‌ల రీసెర్చి ఫలితంగా ప్రచురించారు. తద్వారా 1930లో ఈ పరిశోధన మూలంగా సర్ సి.వి రామన్ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. అలా ఒక చిన్న ప్రశ్న గొప్ప పురస్కారాన్ని అందుకోవడానికి కారణమైంది.

What do you think?

ఐ పి ఓ లాస్ అండ్ గైన్ కథా కమీషు..

ఓ మాతృమూర్తి.. సమాజానికి మంచి పౌరులనివ్వు!