in

ప్రాంతీయ సినిమాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వినని వారుండరంటే అది అతిశయోక్తి కాదేమో. ప్రాంతీయ సినిమాలతో సాగుతున్న సమయంలోనే పాన్ ఇండియా స్థాయి సినిమాలలో నటించిన ఒకే ఒక్క నటుడు చిరంజీవి.

ఇటీవలే 44 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న

చిరంజీవి పొందిన అవార్డులు,సృష్టించిన రికార్డుల ఎన్నో.

పునాది రాళ్ళు సినిమాలో మొదటిగా నటించినప్పటికీ ప్రాణం ఖరీదు సినిమాతో తొలిసారిగా సినీ తెరపైకి వచ్చిన చిరంజీవి మన ఊరి పాండవులు, శుభలేఖ, విజేత,ఖైదీ,జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలను ఇచ్చారు. కే.రాఘవేంద్ర రావు గారు తెరకెక్కించిన ఘరానా మొగుడు సినిమాతో మొదటి సారిగా 10 కోట్ల రూపాయల సంఖ్యను  తెలుగు పరిశ్రమకి పరిచయం చేశారు.1992లో విడుదలైన ఆపద్బాంధవుడు సినిమాకు గాను 1.25 కోట్ల రూపాయలు తీసుకుంటూ,ఇండియాలోనే ఆ కాలంలో అంత మొత్తం తీసుకున్న  ఏకైక నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న ది వీక్ మేగజైన్ వారు రాసినా ఆర్టికల్లో చిరంజీవిని “బిగ్గర్ దెన్ బచ్చన్”గా పేర్కొన్నారు.

ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెల్చుకున్న ఆయన ఆపై నటిస్తూ నిర్మించిన రుద్రవీణ సినిమాకు గాను నేషనల్ అవార్డును పొందారు.అదే విధంగా ఆయన నటనకుగాను మూడు నంది అవార్డులు,తొమ్మిది  ఫిల్మ్ ఫర్ అవార్డులను అందుకున్నారు. ఆ కాలంలోనే  ఆయన స్వయం కృషి సినిమాను రష్యన్ భాషలలోకి అనువదించి

మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మ బూషన్ తో గౌరవించబడ్డారు. రాజకీయాల మూలంగా కొన్ని సంవత్సరాలు సినిమా ప్రపంచానికి దూరమైనప్పటికి ఆయన సినీ జీవితంలో ప్రతి క్షణం ప్రేక్షకులను అలరిస్తూ ఎనలేని అభిమానాన్ని పొందారు.

What do you think?

258 Points
Upvote Downvote

టాప్ 5 మూవీస్ ఆఫ్ నెట్‌ఫ్లిక్స్ 2020

బాధలలోనే సంతోషం వెతుకున్న సిల్క్ స్మిత.