in

గురువు ను నమ్మినడుచుకునే విద్యార్థి ఎప్పుడూ చెడడు.

పూర్వం గురుకులాలలో విద్యను అభ్యసించేవారు, గురువు పట్ల ఎంతో వినయ విధేయతలతో ఉండేవారు. తన విద్యాభ్యాసం అంతయ పూర్తయ్యేవరకూ గురువు వద్దనే ఉంటూ గురువు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవారు. నాటి గురుకులాలు నేటి ఆధునిక విద్యా విధానంలో రెసిడెన్షియల్స్ గా పిలువబడుతున్నాయి. నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో విద్యాలయాలు ఏర్పాటయ్యాయి. నాడు గురుశిష్యుల మధ్య ఎంతో చక్కటి బంధం ఉండేది, నేడు అది కనుమరుగవుతోంది గురువు యాంత్రికంగా చెప్పుకు పోతుంటే, విద్యార్థి ఓ మరమనిషిగా దాన్ని వింటున్నాడు.

మాతృదేవోభవ ! పితృదేవోభవ!  ఆచార్యదేవోభవ! అంటారు, అంటే తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుకి ఇచ్చారు. అటువంటి గురువును గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యత. నేటి చలనచిత్రాల్లో సామాజిక మాధ్యమాల్లో గురువుపై అనేక హాస్య వ్యంగ్య కథనాలతో విద్యార్థుల మానసిక స్థితిని తప్పుదోవ పట్టిస్తున్నారు. హాస్యానికి కూడా గురువును అపహాస్యం చేయకూడదు. గురువు యొక్క లోపాలను ఎత్తిచూపే అర్హత  ఏ విద్యార్థి కి లేదు.

భగవంతుడి ఆగ్రహానికి గురైనా, గురువు కాపాడుతాడు కానీ గురు ఆగ్రహానికి లోనయ్యారంటే భగవంతుడు కూడా రక్షించడు అన్నది ఓ నానుడి. గురువు, విద్యార్థిని దండించే ది విద్యార్థులకు సరైన క్రమశిక్షణ నేర్పడం కోసమే, ఇది విద్యార్థి, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. విద్యా విధానాలలో అభివృద్ధి జరుగుతుంటే విద్యార్థులలో మాత్రం సంస్కారం తగ్గిపోతూ వస్తోంది. ఇది సరిదిద్ద వలసిన బాధ్యత తల్లిదండ్రులదే. గురువును దైవంగా భావించి నడుచుకునే ఏ విద్యార్థి అయినా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడు.

What do you think?

“శాకుంతలం” ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

గుండె ఆరోగ్యానికి పంచ (5) సూత్రాలు