పదహారణాల అమ్మాయి
రూక = రెండు అణాలు, పూర్వం ఈస్టిండియా పాలనలో రూకలు ( నాణేలు) చెలామణిలో( 18వ శతాబ్దం)
ఉండేవి. ఒక్కోసారి ఇవి నాలుగు అణాలకు సమంగా చెలామణి అయ్యాయి. అణా అంటే ఆరు నయాపైసలు. ఐదు రూకలు అంటే 60 నయా పైసలు. ఇండియా ( 18 వ శతాబ్దం)14 రుపీ=పావలా (పావలా అంటే 25 పైసలు), ఇండియా ( 19వ శతాబ్దం) ఒక అణా = ఆరు పైసలు, అర్థణా =.మూడు పైసలు, పావలా= ఇరవై ఐదు పైసలు, ముప్పావలా= మూడు పావలాలు (75పైసలు).
పూర్వ కాలంలో పెద్దలు ఏదైనా పోలికను ఉటంకిస్తూ పొగిడేవారు. మీ అమ్మాయి పదహారణాల కుందనపు బొమ్మ అనేవారు. పదహారు అణాలంటే (16×6) 96 పైసలు, అది వందకు సమానం. అంటే వందశాతం అందగత్తె అనే అర్థంలో ఆ మాట వాడేవారు.
ఒక వేళ పదిహేడు అణాలని అందామంటే అది వంద దాటి 102 అయి కూర్చుంటుంది. అది అతిశయోక్తి అవుతుంది కనుక పదహారణాలు పదాన్ని వందకు సమానార్థంకంగా వాడేవారు. ఇప్పుడు వ్యావహారికంలో రూపాయలతో కూడిన పోలిక అయితే కనిపించదు.ఇదీ మన అణా వెనుక అందమైన కథ.
అణా అంటే రాజు,అన్న, పెద్ద అన్న అనే అర్థాలు ఉన్నాయి.