in

ధనవంతుల కోరిక తీర్చడానికి ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. దాని రేటు ఎంతంటే…

కొంత మంది ధనవంతులు ఒక మంచి విశాలమైన ప్రదేశంలో నలుమూలలా పచ్చని చెట్లు ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశాలలో ఇల్లు కొనాలని కోరుకుంటుంటారు.
ఈ కోరికలను అప్పుడప్పుడు అమ్మకానికి వచ్చే దీవులను కొని తీర్చుకుంటుంటారు.అయితే ఇప్పుడు మరో సారి ఇంకో దీవి అమ్మకానికి వచ్చింది అది కూడా ఒక ఫ్లాట్ కంటే తక్కువ రేటుకి.ఫ్లాట్ కంటే తక్కువ రేటుకి దీవా..?అసలు ఒక దీవి అంత తక్కువ రేటుకి ఎలా అమ్ముడుపోతుంది..? ఇవి తెలియాలి అంటే ఈ స్టొరీ చదవాల్సిందే.

ఫ్లాట్ కంటే తక్కువ రేటు ఉందంటున్న ఆ ఐలాండ్ కరేబియన్ ప్రాంతంలోని నికారాగ్వాకు దగ్గరలోని సముద్ర తీరానికి 12 మైళ్ళ దూరంలో ఉంది.ఈ దీవి పేరు ఇగ్వానా. ఇది ఒక అగ్నిపర్వత దీవి. ఇక్కడ సూర్యోదయం,సూర్యాస్తయం చూసే వారికి ఎంతో ప్రశాంతంగా,మనసుకు ఆహ్లాధకరంగా ఉంటాయి.
ఇక ఈ అగ్నిపర్వత దీవి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి చెట్లు,అరటి చెట్లతో నిండిపోయి ఉంటుంది.ఇది ప్రస్తుతం privateislandsonline.com లో ఆన్లైన్లో అమ్మకానికి ఉంది. అయితే ఇది ఏదో అడవిలాగా, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండదు. ఇక్కడ రోడ్లు, మూడు గదుల బెడ్ రూమ్,రెండు బాత్రూమ్లతో కూడిన ఒక భవనం నివాసయోగ్యంగా ఉంటుంది. దీనికి ఒక మేనేజర్,బాగోగులు చూడడానికి పనివారు కూడా ఉంటారు.సెప్టిక్ సిస్టం, వాటర్ క్యాచ్ మెంట్ సిస్టం కూడా ఉంది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు కూడా ఉన్నాయి. ఇక్కడ నివసించాడనికి అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
దీని ధర మూడు కోట్ల 86 లక్షల రూపాయలు. చాలా పెద్ద పెద్ద నగరాల్లో కేవలం ఒక ఫ్లాట్ ధర మూడు కోట్ల రూపాయల పైనే ఉంటుంది. అలాంటిది 5 ఎకరాల దీవి 3 కొట్లకంటే ధనవంతులకు ఇంతకంటే కావాల్సింది ఏంటి?. పైగా దీన్ని కొని పర్యాటకులు అద్దెకు ఇస్తే డబ్బులు కూడా బానే సంపాదించవచ్చు. అయితే ఇది ఇంకా అమ్ముడు కాలేదు.ప్రస్తుతం దీని అమ్మకానికి ఆన్లైన్ లో బిడ్డింగ్ జరుగుతుంది. ఎవరు ఎక్కువకి పాడుకుంటే ఇది వాళ్ళకి దక్కుతుంది.
అదండీ ఫ్లాట్ కంటే తక్కువ రేట్ ఉన్న ఐలాండ్ విశేషాలు.

What do you think?

338 Points
Upvote Downvote

యాపిల్ల ను అమ్మి దనవంతులైన గ్రామస్తులు, అదేలా గంటే…

కర్ణాటకలో జరిగిన ఈవెంట్ లో పాటల కోయిల మంగ్లీ పై రాళ్ళ దాడి…