in ,

ఈ అమ్మాయి అనంత జనవాహినిలో ఒక స్వేచ్చాపావురం..  

ఈ అమ్మాయి అనంత జనవాహినిలో ఒక స్వేచ్చాపావురం..

ఉత్తర కొరియా నుండి శరణార్థి అయిన యోన్మీపార్క్ అనే అమ్మాయి గురించి మీరు విని ఉండవచ్చు. ఆమె ప్రసంగాలు ఆన్లైన్ బిలియన్ సార్లు కనిపించాయి కూడా. ఆమె తప్పించుకోవడం గురించి రెండు పుస్తకాలు రాసింది మరియు ఉత్తర కొరియా పాలన గురించి చాలా బాహాటంగా మాట్లాడింది. ఎంతగా అంటే కిమ్ జోంగ్-ఉన్ కార్యాలయంలోని వ్యక్తుల నుండి ఆమెకు మరణ బెదిరింపులు కూడా వచ్చాయి.

యోన్మీ పార్క్ (yeonmi park)

నార్త్ కొరియాకి చెందిన ఈ యెన్మి పార్క్ అనే అమ్మాయి తనకి తొమ్మది సంవత్సరాల వయసున్నపుడు తన తండ్రి బ్లాక్ మార్కెట్ లో క్లాత్, షుగర్, రైస్ వీటిపై వ్యాపారం చేసి ఫామిలీని పోషించేవాడు. ఈ విషయం అక్కడ గవర్నమెంట్ కు తెలిసి పార్క్ తండ్రిని, తల్లిని అరెస్ట్ చేసి లాక్అప్ లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. అలాగే తను, తన అక్క, పేరెంట్స్ జైలు లో ఉండడం తో ఫుడ్ కోసం చాల ఇబ్బంది పడేవారు. పార్క్ కి 13 సంవత్సరాలు వచ్చాక 2007 లో వారి పేరెంట్స్ ను కలుసుకున్నారు. అదే టైం లో పార్క్ అక్క తప్పిపోయింది.

పార్క్ తన తల్లిదండ్రితో కొంత మంది బ్రోకర్స్ సహాయం తో నార్త్ కొరియా బోర్డర్ ను దాటుకుని చైనా బోర్డర్ కు చేరుకున్నారు. అయితే పార్క్ ఆకలిబాధ చూడలేక, పార్క్ తల్లి తను 65 డాలర్లకు, అలాగే తన కూతురు పార్క్ ను 250. డాలర్లకు బ్రోకర్స్ కు తనకా అయ్యిపోయారు. ఆ తర్వాత వాళ్ళని చైనాకు తీసుకెళ్లారు. అయితే 2008 లో పార్క్ తండ్రి చనిపోయాడు. కొన్ని రోజులకు చైనాలో ఎవరో ఒక స్త్రీ పార్క్ ని సౌత్ కొరియాకు వెళ్ళండి అక్కడ మీకు ఫ్రీడమ్ దొరుకుతుందని చెప్పింది. దానికి పార్క్ ‘ ఫ్రీడమ్ ‘ అంటే ఏంటి అని అడిగింది. దానికామె ‘నీకు నచ్చినట్టు భయం. లేకుండా బతకటం’ చెప్పింది అప్పటివరకు ఫ్రీడమ్ అంటే ఏమిటో కూడా తెలియని పార్క్ కు ఆ సలహా నచ్చింది. దాంతో 2009 లో పార్క్ తన తల్లితో కలసి ఎవరికీ తెలియకుండా కొంత మంది మిషనరీ వాళ్ళ సహాయంతో చైనా నుండి మంగోలియా బోర్డర్ కు చేరుకున్నారు. బోర్డర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళను అరెస్ట్ చేసి మంగోలియా కాపిటల్ అయిన ఉలాన్ బాటర్ లో కస్టడీకి తీసుకెళ్లారు.
అక్కడికి వాళ్ళు ఎలా చేరుకున్నారో పోలీస్లకు మొత్తం చెప్పారు. రెండు నెలలు తర్వాత వాళ్ళిద్దరిని సౌత్ కొరియా సియోల్ కు పంపించారు.

ఆలా సౌత్ కొరియాకు చేరుకున్నాక, పార్క్ చదువుకోవాలని డిసైడ్ అయ్యింది. అయితే 2014 లో పార్క్ అక్క సౌత్ కొరియా లోనే ఉన్నట్లుగా సౌత్ కొరియా ఇంటిలెజెన్స్ ద్వారా తెలుసుకున్న పార్క్, అక్కను కనుగొని ముగ్గురు ఒకటయ్యారు. ఆ తర్వాత 2014 లో ఐర్లాండ్ లో ‘వన్ యంగ్ వరల్డ్ ‘ ప్రోగ్రాం లో పార్క్ తన ఎక్స్పీరియన్స్ ను ఆమె చిన్నతనం గురుంచి వాళ్ళు అనుభవించిన కష్టాలు గురుంచి, నార్త్ కొరియా లో జీవన విధానం, ఆ దేశ అధ్యక్షుడు కిరాతకుడైన కిమ్ గురుంచి, వాళ్ళు ప్రజలను పెడుతున్న బాధలను అందరికి వివరించింది.

పార్క్ 2015 లో తన ఎక్స్పీరియన్స్ ను ఒక బుక్ లో రాసి పబ్లిష్ చేసింది. ఆ తర్వాత పార్క్ తన స్టడీస్ ను కంప్లీట్ చేసి హ్యూమన్ అక్టివిస్ట్ గ, తనలాగే నార్త్ కొరియా ప్రజలు కూడా ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలుసుకోవాలని దానికోసం ఎన్నో స్పీచ్ లలో అందరికి నార్త్ కొరియా గురుంచి చెప్పి అక్కడ ఉండే ప్రజలను కాపాడాలని తెలిపింది. తనలాగే అందరు ముందుకు వచ్చి నార్త్ కొరియా గురుంచి ప్రపంచానికి తెలియ చేయాలనీ సోషల్ మీడియా వేదికగా కోరింది. పార్క్ నార్త్ కొరియా నుండి తప్పించుకుని ఫ్రీడమ్ అనే అర్ధం తెలుసుకుంది. అమెరికాలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కొడుకు తో సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి జీవితం నార్త్ కొరియాలో ఉండే ప్రతి ఒక్కరికి రావాలి. కిమ్ క్రూరత్వాన్ని అందరు తెలుసుకోవాలి, కిమ్ అరాచకాలకు చెక్ పెట్టాలి. అపుడే అంధకారంలో ఉండిపోయిన వేల జీవితాలు వెలుగులోకి వస్తాయి.
అనేదే ఆమె ఆశ…

What do you think?

అతని మరణంతో మానవాళి నుంచి మరొక తెగ అంతరించిపోయింది

అప్పు మీ జీవితానికే కాదు,ప్రాణాలకు కూడా ప్రమాదమే!