సామాన్యుడికి శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.కేజీ టమాట రూ.50
రోజు రోజుకు నిత్యావసరాల ధరలు ఊహించని రీతిలో పెరిగి పోతున్నాయి. కడుపు నిండాలంటే రోజుకి రూ.150, రూ.200 సులువుగా కర్చయిపోతున్నాయి. ఇప్పుడు టమాటాల ధర కూడా కేజీ రూ.100 రూపాయలు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అలాంటి ఈ సమయంలో సామాన్యుడికి కొంతైనా ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. కేజీ టమాటా ధర రూ.100కి చేరడంతో నేటి నుంచి అన్ని నగరాల్లోని రైతు బజార్లలో టమాటను కేజీ రూ.50 కే విక్రయించేలా చర్యలు చేపట్టంది. మదనపల్లి, పత్తికొండ, కలికిరి మార్కెట్లలో రైతుల నుంచి కిలో రూ.70 చొప్పున రోజుకు 50 నుంచి 60 టన్నులు సేకరిస్తున్నారు.
ధరలు అదుపులోకి వచ్చేంత వరకు ఈ సబ్సిడీ కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.